Rishabh Shetty:ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏదైనా సినిమా చర్చలకు దారితీసింది అంటే అది కాంతార సినిమా అని చెప్పాలి.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ వివిధ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా సినిమాను కర్ణాటక తుళునాడులోని కోలా, కంబా సంప్రదాయ ఆచారాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు.
ఇక ఈ సినిమాలో ఒక వ్యక్తికి దేవుడు ఆవహించిన సమయంలో కోల ఆడే వ్యక్తులు ఓ.. అంటూ వింత శబ్దాన్ని చేస్తారని ఆ సినిమాలో చూపించారు. ఆ శబ్దం వచ్చినప్పుడు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ క్రమంలోనే ఈ శబ్దంపై డైరెక్టర్ స్పందిస్తూ ప్రేక్షకులకు ఓ విన్నపం చేశారు. దయచేసి ఎవరూ కూడా ఆ శబ్దాన్ని ఇమిటేట్ చేయకండి అంటూ ఈయన ప్రేక్షకులను రిక్వెస్ట్ చేశారు.
అది కేవలం శబ్దం మాత్రమే కాదని.. అది తమకు ఓ సెంటిమెంట్ అని ఇది ఒక ఆచారం ఆధ్యాత్మిక నమ్మకం. ఇది చాలా సున్నితమైన అంశం ఇలా ప్రేక్షకులు బయట కూడా ఈ శబ్దాన్ని చేయటం వల్ల ఆచారం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి దయచేసి ఎవరూ కూడా ఈ శబ్దాన్ని చేయకండి అంటూ ఈ సందర్భంగా రిషబ్ శెట్టి అభిమానులకు చిన్న విన్నపం చేశారు.
ఇక ఈ సినిమాని రిషబ్ శెట్టి తన నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ఇక ఈ సినిమాలో ఒక మనిషిలోకి దేవుడు ఆవహించే సమయంలో ఎలా ఉంటారనే విషయాన్ని చాలా దగ్గరగా చూపించడంతో ప్రతి ఒక్కరి ఒళ్ళు జలదరించేలా డైరెక్టర్ ఈ సినిమాని ప్రేక్షకులకు చూపించారు.ఈ విధంగా అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ఎంతో మంది శనీ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కోర్టు ఆదేశాలతో ‘మెగా’ నిర్ణయం తెలుగు చలనచిత్ర పరిశ్రమ (TFI) చరిత్రలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. సినిమాలపై సోషల్ మీడియాలో…
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…