Rocking Rakesh -Sujatha: ఈ మధ్యకాలంలో జబర్దస్త్ ద్వారా కేవలం కమెడియన్ లు మాత్రమే కాకుండా పలువురు జంటలు కూడా తెగ పాపులర్ అవుతున్నాయి. జబర్దస్త్ షోలో కొంతమంది లేడీ కమెడియన్స్, కమెడియన్ తోనే ప్రేమలో పడినట్లు అనేక రకాల వార్తలు వినిపించగా వారు కూడా అందుకు అనుగుణంగానే అడ్వాంటేజ్ గా మాట్లాడుతూ చేస్తుండడంతో అది నిజమే అని భావిస్తున్నారు. కాగా ఇప్పటికే వర్ష- ఇమాన్యుల్, ఆసియా -నూకరాజు, సుజాత- రాకేష్ ఇలాంటి జంటలు తెగ పాపులర్ అయిన విషయం తెలిసిందే.
ఈ మధ్యకాలంలో రియాలిటీ షోలలో ప్రేమ వ్యవహారాలను హైలెట్ చేస్తూ రేటింగ్స్ అందుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన జంటల్లో సర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్ జంట కూడా ఒకటి. కాగా ప్రస్తుతం రాకింగ్ రాకేష్ టాప్ కమెడియన్స్ లిస్టులో ఉన్న విషయం తెలిసిందే. ఇక రాకింగ్ రాకేష్ స్కిట్ లో చేస్తున్న సుజాత, వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అంతేకాకుండా వీరిద్దరూ అప్పుడప్పుడు స్కిట్ల మధ్యలో ఎమోషనల్ అవ్వడం హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం లాంటివి చేయడంతో వీధి మధ్య లవ్ నిజంగానే ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకింగ్ రాకేష్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ..తనది ప్రేమ కాదు అంతకంటే ఎక్కువ బంధం అని కూడా చెప్పడంతో వీరి మధ్య నిజంగానే ప్రేమ ఉంది అని అందరూ అనుకుంటున్నారు.
ఇక తాజాగా జరిగిన షోలో భాగంగా రాకేష్ తన మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టడంతో రాకింగ్ రాకేష్ మాటలు విన్న సుజాత స్టేజ్ పైనే చాలా ఎమోషనల్ గా దగ్గరికి వచ్చి కౌగిలించుకుంది. అంతేకాకుండా నుదుటి పై ముద్దు కూడా పెట్టి తన ప్రేమను తెలియజేసింది సుజాత. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్‌లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…