Sridevi Drama Company: బుల్లితెరపై మల్లెమాలవారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్నాయి. ఇకపోతే ఈకార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎంతో ఉత్కంఠ భరితంగా ప్రోమోలు కట్ చేయడం మనం చూస్తున్నాము.
ఈ ప్రోమోలు చూడగానే అసలు ఏం జరిగిందోననే కంగారు ఆత్రుత ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో కలిగేలా కట్ చేస్తున్నారు. వేదికపైనే గొడవపడి సెట్ లో నుంచి వెళ్లిపోవడం, ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితులు కల్పిస్తూ ప్రోమోలు కట్ చేశారు.ఇలా ప్రోమోలు చూసిన అభిమానులు ఈ కార్యక్రమాన్నిఅంతే ఆత్రుతగా చూసినప్పటికీ చివరికి అక్కడ ఏమీ లేకపోవడంతో కార్యక్రమ నిర్వాహకులపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇప్పటికే ఇలా ఈ కార్యక్రమం రేటింగ్ కోసం ఇలాంటి ప్రోమోలు కట్ చేసి ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడటంతో మల్లెమాల వారిపై ప్రేక్షకులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో చూస్తుంటే ఈ కార్యక్రమం ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమాన్ని తలపించిందని చెప్పాలి.
ఈ కార్యక్రమంలో భాగంగా మీకు నచ్చని వారి ఫోటోలను చింపడం లేదా కాల్చివేయడం చేయండి అంటూ రష్మి టాస్క్ ఇస్తుంది. అయితే ఈ టాస్క్ లో భాగంగా అందరూ హైపర్ ఆది ఫోటోలను చింపడంతో ఆయన ఎంతో ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ ప్రోమో కాస్త ఎపిసోడ్ పై భారీ అంచనాలను పెంచేలా ప్రోమో కట్ చేయడంతో ఇది చూసిన నెటిజన్ లు మరోసారి మీ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా మీరు మారరా అంటూ పెద్ద ఎత్తున మల్లెమాలపై నేటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…