Rocking Rakesh: రాకింగ్ రాకేష్ స్కిట్ లో రెచ్చిపోయిన సీనియర్ నటి.. సిగ్గుతో పక్కకు తప్పుకున్న రాకేష్!
Rocking Rakesh: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్య క్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ డబుల్ మీనింగ్ డైలాగులతో స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్ స్కిట్ లో భాగంగా సీనియర్ నటి నట కుమారి సందడి చేశారు. అయితే ఈమె ఇదివరకే జబర్దస్త్ కార్యక్రమ వేదిక పై సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇదిలా ఉండగా నట కుమారి జబర్దస్త్ వేదికపై మాత్రమే కాకుండా ప్రత్యేకమైన కార్యక్రమాలలో కూడా ఈమె సందడి చేస్తూ తన అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. క్లాసికల్ డాన్స్ లో ట్రైనింగ్ అయిన ఈమె మాస్ డాన్స్ చేస్తే మాత్రం అవతలవారు భయపడాల్సిందే.
ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్ స్కిట్ లో భాగంగా మాస్ స్టెప్పులతో ఒక ఊపు ఊపింది. ఈమె చేసే మాస్ స్టెప్పులను చూడలేక రాకింగ్ రాకేష్ సిగ్గుతో పక్కకు తప్పుకున్నారు. ఇదే కాకుండా మరొక స్కిట్ లో అయితే ఏకంగా తన కొలతలు తీసుకొమ్మని తన బ్యాక్ చూపిస్తూ ..స్కిట్ మొత్తం గబ్బు పట్టించిందని చెప్పాలి.
ఇలా వేదికపై రాకింగ్ రాకేష్ నట కుమారి చేసిన స్కిట్ చూస్తూ రోజా పగలబడి నవ్వారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ కార్యక్రమం ద్వారా కామెడీ చేసే మరింత వినోదం చూడాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…