Movie News

రోజా కొత్త బిజినెస్.. కూతురు ఆలోచనతో గ్రాండ్ ఓపెనింగ్..!!!

సినీ నటి, ఫైర్ బ్రాండ్ , నగరి ఎమ్మెల్యే , బుల్లితెర మహారాణి రోజా ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. హీరోయిన్ గా ఉన్నపుడు ఎలాగైతే చక్రం తిప్పిందో ఇప్పుడుకూడా అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ ని ఏలుతుంది.. ప్రస్తుతం ఆమె చేతిలో మంచి మంచి ఆఫర్స్ తో పాటు, రాజకీయంగా మంచి పేరు అన్నీ ఆమెకు బాగానే ఉన్నాయి.. జబర్దస్త్ షో తో పదేళ్లుగా ఆమె ప్రేక్షకులను అలరిస్తుంది.. అందులో జడ్జి గా పెద్ద దిక్కుగా ఉంటూ షో ఇంత విజయవంతంగా రన్ అవడానికి కారణం అవుతుంది. అయితే ఈ స్థానం రావడానికి ఆమె పడ్డ కష్టం అంతా ఇంతాకాదు.. తొలినాళ్లలో ఆమె హీరోయిన్ అవడానికి ఎంత కష్టపడిందో ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. తాను నల్లగా ఉన్నానని అందరూ ఎగతాళి చేసేవారని కూడా చెప్పింది..

అయితే అవన్నీ తట్టుకుని నిలబడింది కాబట్టే రోజా ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది.. ఎవరో అవమాన పరిచారని వెనక్కి వెళితే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది.. ఇక సినిమాలనుంచి రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ గెలిచిందంటే ఒక మహిళగా రోజా ఎంత ఆత్మనిబ్బరంగా ఉందొ మనం అర్థం చేసుకోవచ్చు.. ఇకపోతే తాజాగా ఆమె మరో బిజినెస్ లోకి దిగిందని తెలుస్తుంది. తన కూతురు సలహా మేరకు అప్పుడే బిజినెస్ లు లాంచ్ చేయిస్తున్నారు. ఇటీవల మొదలు పెట్టగా ఆ వేడుకకు సీనియర్ నటీమణి కూడా వచ్చారు.రోజా కూతురు అన్షుమాలిక టీనేజ్ వయసు దాటడానికి చాలా దగ్గరలోనే ఉంది. ఇక ఆమె మంచితనంపై ఒక ఇంటర్వ్యూలో రోజా చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు. పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా సొంతంగా తనకు తోచినంత సహాయం చేస్తోందట.

ఇక ఇటీవల అన్షుమాలిక సలహా మేరకు రోజా యూనిక్ బ్యూటీ సెలూన్ స్థాపించారు. గ్రాండ్ గా మొదలైన ఆ వేడుకకు సీనియర్ హీరోయిన్ మహేశ్వరి కూడా స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రోజా కూతురిని చూసిన మహేశ్వరి అప్పుడే అన్షు ఇంత పెద్దగా అయిపోయిందా అంటూ షాక్ అయ్యింది. రోజా తనయుడు కృష్ణ లోహిత్ సెల్వమని హీరోగా ఎంట్రీ ఇస్తాడాని గత ఇంటర్వ్యూలలో రోజా చాలా సార్లు వివరణ ఇచ్చారు. ఇంకా స్కూల్ దశలోనే ఉన్న అతను ప్రస్తుతం పూర్తిగా ఎడ్యుకేషన్ వైపే దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఎడ్యుకేషన్ అనంతరం తన ఇష్ట ప్రకారం ఏదైతే అది కావచ్చని రోజా వివరణ ఇచ్చారు.

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago