టాలీవుడ్ లో టాప్ హీరోలందరితోనూ నటించి హీరోయిన్ గా పాపులరైన రోజా అటు రాజకీయాలలో ప్రజా ప్రతినిధిగానూ.. ఇటు జబర్దస్త్ టీవి షో ద్వారా ప్రేక్షకులకు ఎంత చేరువయ్యారో మీకు తెలుసు. ఫైర్ బ్రాండ్ లేడిగా పేరు తెచ్చుకున్న రోజా నిజానికి చెంబరుతి చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమయ్యారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ సందర్భంలోనే చిత్ర దర్శకుడు సెల్వమణితో రోజాకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారి.. చివరకు ఏడడుగులు వేసేవరకూ వచ్చింది. రోజా, సెల్వమణి వివాహం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ చెప్పుకోతగ్గ విషయమేమిటంటే..
డైరెక్టర్ సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్ని ముందుగా రోజాకు కాకుండా రోజా తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పారట. రోజా తండ్రిని ఒప్పించిన తర్వాతే రోజాకు తన ప్రేమ సంగతి తెలియజేశాడట. రోజా కూడా సెల్వమణి ప్రేమకు ముగ్ధురాలై ఆయన కోసం తమిళం మాట్లాడటం, చదవడం కూడా నేర్చుకుంది. ఆ తర్వాత పెళ్ళి.. రాజకీయ రంగ ప్రవేశం షరా మామూలే..! సినిమా రంగంలో నటించడమే ఒక అదృష్టమనుకుంటే తాము కోరుకున్న వ్యక్తినే పెళ్ళి చేసుకోవడం మహా అదృష్టమనే చెప్పొచ్చు. కానీ రోజా దంపతులను సమరం అనే తెలుగు సినిమా రూపంలో దురదృష్టం రూపంలో వెంటాడిందని చెప్పవచ్చు. ఎలాగంటే..
1994లో సమరం అనే ఓ యాక్షన్ మూవీకి రోజాయే స్వయంగా నిర్మాతగా వ్యవహరించారు. అందులో సుమన్, రోజాలు జంటగా నటించారు. కానీ ఎందుకనో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యింది. దీంతో రోజాకు ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. ఇదండి సంగతి.. అదృష్టం వెనకనే దురదృష్టం కూడా వుంటుందనే జీవిత సత్యానికి రోజా నిజ జీవితంలోని ఈ ఒక్క ఉదాహరణ చాలన్నమాట.!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…