Movie News

బాలయ్య టాక్ షోలో రోజా.. ఉత్కంఠభరితంగా మారనున్న ఎపిసోడ్!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి వెండితెరపై ప్రేక్షకులను అలరించారు. మొదటిసారిగా బుల్లితెరపై అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. బాలయ్య తొలిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కావడంతో ఈ షో కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ షో మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ లుగా మోహన్ బాబు ఫ్యామిలీ వచ్చారు.

రెండవ ఎపిసోడ్ కి జస్ట్ గా నాచురల్ స్టార్ నాని వచ్చారు. రానున్న రోజుల్లో కూడా ఈ షోకి అతిధులుగా క్రేజీ సెలబ్రిటీలు రాబోతున్నారు అంటూ వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక తదుపరి ఎపిసోడ్ కి గెస్ట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రాబోతున్నట్టు సమాచారం. ఆ తరువాత ఎపిసోడ్ కూడా గెస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణతో కలసి వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన బాలయ్య లక్కీ హీరోయిన్ రోజా ఈ షోకి అతిథిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ ప్రస్తుతం ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచుతోంది. బాలకృష్ణ రోజా కాంబినేషన్ లో వచ్చిన బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం లాంటి సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.

ఇవే కాకుండా పెద్దన్నయ్య, మాతో పెట్టుకోకు, సుల్తాన్ లాంటి సినిమాలలో కూడా నటించింది. అందువల్లే బాలకృష్ణ,రోజా ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ వేర్వేరు పార్టీలలో ఉన్నప్పటికీ రోజాకు బాలకృష్ణ అంటే అభిమానం. ఇక పొలిటికల్ విషయానికి వచ్చినప్పుడు ఆమె బాలకృష్ణ పై కూడా విమర్శలు చేయటం అనేది చాలా సార్లు చూసి ఉన్నాయి.తెల్ల వీరిద్దరూ పాల్గొనడంతో బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనేదాని గురించి ఎంతో ఉత్కంఠత ఏర్పడింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

4 minutes ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

16 minutes ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

31 minutes ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

41 minutes ago

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

58 minutes ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

1 hour ago