RP Patnaik: ఆర్పీ పట్నాయక్ పరిచయం అవసరం లేని పేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ఒకానొక సమయంలో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు.ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా అద్భుతమైన గాత్రంతో ఈయన పాడిన పాటలు ఎంతో ఫేమస్ అయ్యాయి.
ఇప్పటికీ ఈయన పాడిన పాటలు అందించిన సంగీతం ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.అయితే ఇండస్ట్రీకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు రావడంతో ఈయనకు క్రమక్రమంగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇలా 2016వ సంవత్సరంలో ఈయన చివరిసారిగా సినిమాలు చేశారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి
ఆర్పీ పట్నాయక్ తాను మహేష్ బాబు సినిమాలకు పాటలు పాడి తప్పు చేశాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ఇన్నేళ్ల తన సినీ కెరియర్లో ఏ విషయంలోను తాను రిగ్రెట్ గా ఫీల్ కాలేదని, ఒక మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో మాత్రం తాను ఇప్పటికీ రిగ్రేట్ గా ఫీలవుతున్నానని తెలిపారు.ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసే సమయంలో అనుకోని పరిస్థితుల కారణంగా తాను సింగర్ ఉషతో కలిసి ఎక్కువ పాటలు పాడానని తెలిపారు.
ఇలా మహేష్ బాబు సినిమాకు నేను పాటలు పాడి పెద్ద తప్పు చేశాను ఎందుకంటే నా వాయిస్ మహేష్ బాబుకు ఏ మాత్రం సెట్ అవ్వలేదు.అందుకే ఈ పాటలు ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయిందని తెలిపారు. ఇక ఈ సినిమా సమయంలో చాలామంది నాకు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పారని తెలిపారు. మరి కొందరైతే చాన్స్ ఉంది కదా అని ఎలా పడితే అలా పాడేస్తావా అంటూ మొహం మీదే అన్నారని ఆర్పీ పట్నాయక్ మహేష్ బాబు సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…