Umair Sandhu – RRR: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమా జనవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ బోర్డు సభ్యులతో పాటు తాను కూడా ఈ సినిమా చూశానని ఈ సినిమా ఎలా ఉందనే విషయాన్ని వెల్లడిస్తూ.. ఈ సినిమాకి ఆత్మ ఆ హీరో మాత్రమేనని ఒక సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇంతకీ ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చిన వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే..ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలు విడుదల కాకముందే సినిమా రివ్యూ చెప్పిన ఉమైర్ సంధు అనే వ్యక్తి యూఏ ఈ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెబుతూ సినిమాలకు రివ్యూ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ సినిమా రివ్యూ ఇవ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరొక ఆశక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఈయన రివ్యూ ఇచ్చిన సినిమాలకు ఈయన రివ్యూ ఇచ్చిన విధంగా జరగకపోయినప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద వివాదం మాత్రం చెలరేగుతుంది. ఇప్పటికే కాటమరాయుడు, అజ్ఞాతవాసి, స్పైడర్, సాహో వంటి చిత్రాలు బ్లాక్ బాస్టర్ అంటూ రివ్యూ ఇచ్చారు అయితే ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఉమైర్ సంధు ఆర్ఆర్ఆర్ కి ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం పై రామ్ చరణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈయన పరోక్షంగా ఈ సినిమాకు ఎన్టీఆర్ ఆత్మ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏది ఏమైనా మరోసారి ఉమైర్ సంధు సోషల్ మీడియాలో ఇద్దరి ఫాన్స్ మధ్య చిచ్చు పెట్టాడని చెప్పవచ్చు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…