RRR in Nepal : ఆర్ఆర్ఆర్ మార్చి 25 నా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తర్వాత ఎక్కడచుసిన ఈ సినిమా గురించే చర్చ. రాజమౌళి మాస్టర్ మైండ్ తో తీసిన ఈ అద్భుత్తాన్ని ప్రపంచంలోని సినిమా ప్రేక్షకులందరు మెచ్చుకుంటున్నారు.ఇక ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన అందరిని ఆశ్చర్యపరచింది.
ఇద్దరు మాస్ హీరోలను బ్యాలెన్స్ చేయడంలో రాజమౌళి ఎక్కడ తడబడలేదు. సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ల స్నేహం వారిద్దరి మధ్య సాగే సన్నివేశాలు ఆడియన్స్ నూ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నార్త్ లో మిగిలిన సినిమాలను తొక్కుకుంటూ పోతూ రికార్డులు బద్దలు కొడుతోంది.
ఇక కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది ఆర్ఆర్ఆర్. ఇక తాజాగా వైరల్ అవుతున్న విషయం నేపాల్ లోనూ ఆర్ఆర్ఆర్ రచ్చ చేస్తోంది. ఏకంగా 7కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. విడుదలైన రోజు నుండి రోజు కోటిరుపాయల చొప్పున ఏడు కోట్లు వసూలు చేసింది.నేపాల్ లో ఈ మేర కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్ మాత్రమే నేపాల్ లో సినిమా చూసిన నేపాళీలు స్క్రీన్ ముందుకు వెళ్లి ఈలలు వేస్తూ డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది.
ఇక ఆస్ట్రేలియాలో, దుబాయ్ లో, ఆఫ్రికన్ దేశాలలో కూడా ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లను సాధిస్తోందని పరిశ్రమ వర్గాల్లో టాక్ . ఆర్ఆర్ఆర్ సినిమాలోని హీరోల ఎంట్రీ సీన్లు, క్లైమాక్స్ సన్నివేశానికి , ఇంటర్వెల్ సన్నివేశాలకు కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక హిందీ బెల్ట్ లో కూడా ఆర్ఆర్ఆర్ వంద కోట్లు వసూలు చేయడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…