Movie News

RRR Movie: పుష్ప 2 ముందు RRR సినిమాని తీసి పారేసిన బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ కే ఆర్ కే.. ట్వీట్ వైరల్!

RRR Movie: బాలీవుడ్ నటుడు నిర్మాత ఫిలిం క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన చేసే సంచలనాత్మకమైన ట్వీట్లు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.సెలబ్రిటీల గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ పలు వివాదాలను ఎదుర్కోవడమే కాకుండా ఈయనపై కొంతమంది సెలబ్రిటీలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

ఈ విధంగా ఫిలిం క్రిటిక్ అంటూ చెప్పుకునే ఈయన ముందుగానే సినిమాలకు తన రివ్యూ ఇస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా ఈయన తెలుగు సినిమాలు అయినటువంటి పుష్ప 2, RRR సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో అన్ని భాషల రైట్స్ కి రూ. 1050 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఈయన ట్వీట్ చేశారు.

RRR Movie: పుష్ప 2 గురించి గొప్పగా చెప్పిన కేఆర్కే..

ఈ విషయం గురించి ఎక్కడ అధికారక ప్రకటన లేకపోయినా ఈయన మాత్రం పుష్ప 2 సినిమా కోసం భారీగా డిమాండ్ చేస్తున్నారని అయితే RRR సినిమా కేవలం 750 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇలా పుష్ప 2 సినిమా ముందు RRR చులకనగా చేసి మాట్లాడటంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం RRR సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ రేసులో నిలబడి అందరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఉండగా ఈయన మాత్రం ఈ సినిమా గురించి చులకన భావనతో మాట్లాడటంతో నేటిజన్స్ మండిపడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెళ్లికి అతిథిలా వచ్చి 4 లక్షలతో మాయం.. జైపూర్‌లో రిసెప్షన్‌లో దొంగతనం కలకలం

ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…

2 minutes ago

బంగారం, వెండిలో ట్రేడింగ్ సులువు…పెట్టుబడిదారులకు శుభవార్త!

అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…

14 minutes ago

ప్రపంచ కుబేరుల టేబుల్ సీక్రెట్స్.. మీరు ఊహించని ఆహార అలవాట్లు

బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…

26 minutes ago

ఫాస్ట్ ఫుడ్ షాక్.. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ తినే ముందు ఇది చదవండి.!

ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఫాస్ట్…

30 minutes ago

అవసరానికి మించి నిద్రపోకండి… ఇవే మీ శరీరానికి వచ్చే ప్రమాదాలు!

అవసరానికి మించిన నిద్ర తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు మనిషి ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైన అంశం.…

38 minutes ago

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో కొత్త మలుపు… ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను ఏ-2గా చేర్చిన సిట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ…

56 minutes ago