ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం భారీ ఎత్తున విడుదలయ్యింది. ఎన్టీఅర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి భారీ తారాగణం, హై టెక్నికల్ వాల్యూస్‌తో భారీ అంచనాతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్తాయిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. సౌత్, నార్త్ అని తేడాలేకుండా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

ఈ క్రమంలో రామ్ చరణ్, ఎన్టిఆర్ నటనకు ఫిదా అయిపోయారు సినీ ప్రేక్షకులు. వీరిద్దరితో పాటూ సినిమాలో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. వారిలో మల్లి పాత్రలో నటించిన పాప నటన ఆదరినీ ఆకట్టుకుంది. ఈ నేపధ్యంలో ఈ అమ్మాయి ఎవరు అని సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. మల్లి పాత్రలో నటించిన ఆ పాప పేరు ట్వింకిల్ శర్మ.

చండీఘర్ ప్రాంతానికి చెందిన ట్వింకిల్ శర్మ ‘డాన్స్ ఇండియా డాన్స్’ అనే రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై పలు టీవీ యాడ్స్‌లో కూడా నటించింది ట్వింకిల్ శర్మ. ఈ క్రమంలో ఈకామర్స్ వెబ్ సైట్ అయిన ఫ్లిప్ కార్ట్ కు సంబంధించిన యాడ్ చూసిన డైరెక్టర్ రాజమౌళి ఆమెను ఆడిషన్‌కు పిలిపించి మల్లి పాత్ర కోసం సెలక్ట్ చేశారట. ఇక RRR సినిమాలో ‘నన్ను ఈడ ఇడిసిపోకన్న అమ్మా.. యాదికొస్తాంది’ అంటూఎన్టీఆర్ తో మల్లీ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది.






























