“ఆర్ఆర్ఆర్” సినిమా కోసం యావత్ సినీమా ప్రపంచం చూసిన ఎదురుచూపులకు నేటితో తెరపడింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదలైన #RRR మూవీ రాజమౌళీ మార్క్ తో అద్బుతమైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక నిన్న రాత్రి నుంచే బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్, ఓవర్సీస్ షోస్ మొదలవ్వడం తో ట్విట్టర్ తో పాటూ సోషల్ మీడియా మొత్తం #RRR హ్యాష్ టాగ్ టెండ్ అవుతుంది.

ఈ చిత్రంలో చరణ్ – ఎన్టీఆర్ ఇద్దరూ కలిసిన నటించిన సీన్స్ ఏంతో అద్భుతంగా తీర్చి దిద్దారట డైరెక్టర్ రాజమౌళీ. మొత్తంగా ఈ సినిమా ఒక విజువల్ వండర్ అంటూ ఎటు చూసినా సూపర్ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఇక తన ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ ప్రీమియర్ షో వీక్షించారు. హైదరబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో రాత్రి 9 గంటలకు అయన ఫ్యామిలీతో కలిసి సినిమా చూసారు. ఈ క్రమంలో ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మి ప్రణతి తో పాటూ అయన ఇద్దరు కుమారులు, అన్న కళ్యాన్ రామ్ కూడా సినిమాను వీక్షించారు. సినిమా చూసిన తిరిగి వెళ్ళేప్పుడు మీడియా కంట పడ్డారు ఎన్టీఆర్. సినిమా సూపర్ హిట్ అంటూ సిగ్నల్ ఇచ్చారు.
@tarak9999 looks damn happy post #RRR screening in Hyderabad#jrntr @ArtistryBuzz #RRRTakeOver #RRRMoive pic.twitter.com/w84nrLEheC
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) March 24, 2022
మరోవైపు హైదరాబాద్ లోని బ్రమరంబ థియేటర్ లో రామ్ చరణ్ తో కలిసి మెగా హీరోలు వరుణ్ తేజ్, అల్లు శిరీష్ లు బెనిఫిట్ షో చూసారు. వీరితో పాటూ డైరెక్టర్ రాజామౌళీ కూడా అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు. ఇక సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావటంతో అటు నందమూరి మరియు మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Mega power star #RamCharan???? Papped waving fans at bhramaramba theater post watching early morning show of #RRR in Hyderabad @ArtistryBuzz @AlwaysRamCharan #RamCharanfans #SeethaRAMaRajuCHARAN #RamCharan #rrrmovie pic.twitter.com/3BiMPndqHV
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) March 25, 2022
Sensational Director #SSRajamouli & Mega Power ???? #RamCharan watched #RRRMovie Benefit show along with the fans!! ????????#RRR #JrNTR #TeluguFilmNagar pic.twitter.com/OozcGsmjIQ
— Telugu FilmNagar (@telugufilmnagar) March 25, 2022






























