సంక్రాంతి కూడా కష్టమే.. ఇక డైరెక్ట్ సమ్మర్ కేనట..??

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తోంది..రోజుకు దాదాపు 3 లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో.. సాధారణ జనమే కాదు.. సినీ జనాలుకూడా భయపడుతున్నారు. దీంతో.. చాలావరకు షూటింగులన్నీ అర్ధంతరంగా నిలిచిపోయాయి. కనీసం నెల రోజులు గడిచిపోతే తప్ప.. షూటింగులు ఎప్పుడు మొదలవుతాయి? అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.దీంతో.. జక్కన్న చెక్కుతున్న RRR విడుదల మరింత వెనక్కి వెళ్లిపోవడం ఖాయమనే చర్చ సాగుతోంది.

నిజానికి ఈ సినిమా గతేడాది సమ్మర్లో రావాల్సి ఉంది. కానీ.. కొవిడ్ లాక్ డౌన్ తో అనివార్యంగా వాయిదా పడింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ.. పలు కారణాలతో మళ్లీ వెనక్కు వెళ్లిపోయింది. దీంతో మూడోసారి డేట్ ప్రకటించాడు దర్శకుడు.2021 దసరా కానుగా బొమ్మ పడడం గ్యారంటీ అన్నారు. అక్టోబర్ 13న సినిమా రిలీజ్ చేసి తీరుతామని ప్రకటించారు.

కానీ.. అదికూడా కష్టమే అనుకుంటూ వస్తూనే ఉన్నారు. మధ్యలో హీరోయిన్ కరోనా బారిన పడడం.. చరణ్ ఆచార్యకు వెళ్లడం.. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు? షోకు వెళ్లాల్సి ఉండడంతో.. దసరాకు కష్టమే అన్నది బలపడింది. దీంతో.. ఇక, సంక్రాంతికే అనే వాదన మొదలైంది.ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. సక్రాంతికి కూడా ఈ సినిమా రావట్లేదట! అవును.. సినిమా చిత్రీకరణ ఇంకా బ్యాలెన్స్ ఉంది.

అది కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు చాలా సమయం తీసుకోవాల్సి ఉంటుంది. వీఎఫ్ఎక్స్ వర్క్, డబ్బింగ్‌, ఎడిటింగ్ వగైరాలు కలుపుకొని కనీసం 6 నెలల సమయం పడుతుంది. అంతకన్నా ఎక్కువే పట్టినా ఆశ్చర్యం లేదు. ఇదంతా జరగాలంటే.. ముందు షూటింగ్ మొదలు కావాలి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు.అందువల్ల RRR మూవీ వచ్చే సమ్మర్ కు వెళ్లిపోవడం ఖాయం అని అంటున్నారు. ఈ విషయంపై ఓ నెల రోజుల్లో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు..మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి…!!