RRR Movie: ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం RRR.ఈ సినిమా గత ఏడాది విడుదలై పాన్ ఇండియా స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాకు గాను ఎన్నో పురస్కారాలు అవార్డులు కూడా వచ్చాయి.
ఇక తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం అందరినీ ఎంత సంతోషానికి గురి చేసింది. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ రాజకీయ సెలబ్రిటీలు ఈ సినిమా అందుకున్న ఈ గొప్ప అవార్డు గురించి ప్రశంసలు కురిపించారు. అయితే కొందరు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఈ సినిమాలోని నాటు నాటు పాట చాలా బోర్ కొడుతుందని సినిమా కూడా పెద్దగా ఏమీ లేదని చాలామంది ఈ సినిమాపై విమర్శలు చేశారు.ఇలా కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమాపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ విమర్శకులకు తమదైన శైలిలో సమాధానం చెబుతున్నారు.
ఇప్పటికే RRR సినిమా గురించి వస్తున్న విమర్శలపై స్పందించిన అనిరుధ్ గుహ స్పందిస్తూ మీరు చిన్నప్పటినుంచి అంత బాధలో ఉన్నారా పక్కవారి సంతోషాన్ని కూడా ఓర్చుకోలేరా అంటూ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. తాజాగా పూజ భట్ కూడా ఈ సినిమా విమర్శకులపై స్పందిస్తూ…ఒకరి బాధను చూడగలరేమో కానీ పక్కవారి సంతోషాన్ని చూసి మాత్రం ఓర్చుకోలేరు కదా ఇది మానవ నైజం అంటూ ఈ సినిమా విమర్శకులపై మండిపడ్డారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…