Movie News

Shruthi Hassan: అలాంటి వ్యాధితో నేను బాధపడుతున్నాను…. వ్యాధి గురించి ఓపెన్ అయిన శృతిహాసన్!

Shruthi Hassan: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక తాజాగా ఈమె చిరంజీవి బాలకృష్ణ సరసన నటించిన వీర సింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా విడుదలై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

సోషల్ మీడియా వేదికగా తన సినిమా విషయాలను వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఈమె గత కొద్దిరోజులుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నానని తన వ్యాధి గురించి బయటపెట్టారు. ఇలా శృతిహాసన్ మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స కూడా తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

నేను బాధపడుతున్న ఈ సమస్య కారణంగా కొన్నిసార్లు ఎక్కువగా ఆవేశ పడిపోతానని అలాగే సహనం కూడా కోల్పోతున్నానని తెలిపారు.అయితే నాకున్న ఈ సమస్యను బయట పెట్టడానికి మొదట్లో భయపడ్డాను. అయితే ఇలాంటి సమస్యలను దాచిపెట్టడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందన్న ఉద్దేశంతోనే నా సమస్యను అందరితో పంచుకున్నానని శృతిహాసన్ తెలిపారు.

Shruthi Hassan: ప్రశాంతత కోసం సంగీతం వింటాను…

ఇంట్లో అయిన షూటింగ్ లొకేషన్లో అయినా తాను అనుకున్నది జరగకపోతే తనకు చాలా కోపం వస్తుందని,ఈ పరిస్థితి తీవ్రతరం కాకుండా వెంటనే తెరపి కూడా తీసుకుంటున్నానని తెలిపారు. అలాగే ఈ సమస్య నుంచి బయటపడటానికి తాను సంగీతం కూడా వింటున్నానని ఈమె తన వ్యాధి గురించి తెలియజేస్తూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago