Big Breaking News: ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా.. అమెరికా రంగంలోకి..?
Big Breaking News: రష్యా దేశ సరిహద్దును ఎక్కువ మొత్తంలో పంచుకుంటున్న ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. డోన్‌బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని కాసేపటి క్రితమే రష్యా వార్నింగ్ ఇచ్చింది. గత నెల రోజుల నుంచి కూడా ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
ఉక్రెయిన్ తో భవిష్యత్ లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దశ్యంతో.. ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో రష్యా ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. అయితే ఉక్రెయిన్ కు అమెరికా మద్ధతు పలుకుతోంది.
తమ బలగాలను దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఆ ప్రభుత్వాన్ని గద్దే దించుతామని పుతిన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రష్యా కాలుదువ్వుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది.
ఈ నిర్ణయంతో ప్రపంచదేశాలు షాక్ కు గురయ్యాయి. రష్యా దూకుడుపై ఐక్య రాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ ఆపాలని విజ్ఞప్తి చేసింది. రష్యా మాత్రం అనుకున్నదే చేసుకుపోతోంది. అటు అమెరికా దేశం కూడా ఉక్రెయిన్ కు మద్దతుగా.. ఎలాగైన రష్యా దాడులను తప్పికొట్టాలని ప్రయత్నం చేస్తోంది. ఉక్రెయిన్ ను ఎలాగైనా కాపాడాలనే భావిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని.. విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. దయచేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రపంచ దేశాల అధికారులు కోరుతున్నారు. ఇక దీనిపై అత్యవసరంగా ఐక్యరాజ్య సమితి జనరల్ భేటీ అయింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…