S.S Karthikeya: RRR సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ పాట అవార్డు గెలుచుకుంది అంటే అందుకు కారణం ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి కీరవాణి ఈ నలుగురు మాత్రమే అందరికీ తెలిసిందే అయితే కాస్త సినీ పరిజ్ఞానం ఉన్న వాళ్ళయితే ఈ సినిమాకి కారణమైనటువంటి సింగర్స్ పాటల రచయిత గురించి కూడా మాట్లాడుతున్నారు.
ఇలా ఆస్కార్ అవార్డు రావడానికి రాజమౌళి కీరవాణి ప్రత్యేక కారణమని చెబుతున్నారు కానీ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం వెనక కార్తికేయ ప్రమేయం ఉందని చాలామందికి తెలియదు. అసలు ఈ కార్తికేయ ఎవరో కూడా చాలామందికి తెలియదు. కాస్త సినిమాలపై అవగాహన ఉన్నవారికి మాత్రమే ఆయన రాజమౌళి కొడుకు అని తెలుసు కానీ సినీ పరిజ్ఞానం లేని వారికి ఆయన ఎవరో కూడా తెలియదు కానీ ఆస్కార్ అవార్డు రావడానికి కారణమయ్యారు.
ఈ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకోవడానికి కార్తికేయ ప్రమేయం ఎంత ఉంది ఈయన రాజమౌళి భార్య రమా గారి మొదటి భర్త కుమారుడు అయినప్పటికీ రాజమౌళి మాత్రం తన సొంత కుమారుడిగానే భావిస్తున్నారు. ఇక ఈయన ప్రస్తుతం లైన్ ప్రొడ్యూసర్ స్థాయికి వెళ్లిపోయాడు. ‘బాహుబలి’కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి కారణం కార్తికేయ అని అంటుంటారు. ఒక సినిమా మార్కెటింగ్ ప్రమోషన్ చేసే విషయంలో కార్తికేయ దిట్ట అని చెప్పాలి.
ఆర్ఆర్ఆర్’ స్టోరీ దగ్గర నుంచి ఆస్కార్ గెలుచుకోవడం వరకు ప్రతిదీ దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. మార్కెటింగ్, ఇతర దేశాల్లో సినిమా ప్రదర్శన, డబ్బు లెక్కలు, ఆస్కార్ వరకు వెళ్లడానికి ప్లానింగ్ అంతా ఆర్గనైజ్ చేసింది కార్తికేయనే. ఉత్తమ విదేశీ మూవీ విభాగంలో మన దేశం నుంచి ఈ సినిమాని ఆస్కార్ నామినేషన్ కి పంపించకపోవడంతో రంగంలోకి దిగిన కార్తికేయ వేరియన్స్ ఫిల్మ్స్ సహాయంతో ఆస్కార్ కు సినిమాని పంపడానికి కావాల్సిన అన్ని అర్హతలను సాధించాడు ఇలా ఆస్కార్ విషయంలో కార్తికేయ హస్తం ఎంతో ఉండడం చేతనే ఆస్కార్ వేదికపై కీరవాణి కార్తికేయకో స్పెషల్ థాంక్స్ తెలియజేశారు.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…