SV Krishna Reddy: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా నటుడిగా రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ఎస్ వి కృష్ణారెడ్డి ఒకరు. ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా పలు సినిమాలలో నటుడిగా నటించారు.అయితే ఇండస్ట్రీలో ఎన్నో కుటుంబ కథ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డికి సీనియర్ నటుడు కృష్ణ అంటే విపరీతమైన అభిమానం.
ఈ క్రమంలోనే ఈయన కృష్ణ గారితో పలు సినిమాలు చేశారు. ఇలా వీరి కాంబినేషన్లో వచ్చినటువంటి నెంబర్ వన్ సినిమా గురించి గతంలో ఓ సందర్భంలో ఎస్.వి.కృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టలేదు అలాగే ఒక స్టోరీ లైన్ తీసుకెళ్లి కృష్ణ దగ్గరికి వెళ్లి స్టోరీ లైన్ వినిపించాను.
ఈ విధంగా ఈ స్టోరీ లైన్ చెప్పగానే కృష్ణ గారు సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది కలిసి చేద్దామని అన్నారు పూర్తి కథ ఉందా అంటే లేదని చెప్పాను సినిమా హిట్ అవ్వడానికి ఈ స్టోరీ లైన్ చాలు తొందరగా పూర్తి కథ సిద్ధం చేయమని చెప్పారు. కృష్ణ గారు చెప్పిన విధంగానే సినిమా కథ సిద్ధం చేశాము.
ఇక ఈ సినిమాకు నెంబర్ వన్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసాము అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా పలుకు వివాదాలు తలెత్తాయని కృష్ణారెడ్డి తెలిపారు.ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉండగా ఈ టైటిల్ కృష్ణ గారికి ఎందుకు పెడుతున్నారు అంటూ తనని ప్రశ్నించారని కృష్ణారెడ్డి తెలిపారు అయితే తన దృష్టిలో కృష్ణ గారు నెంబర్ వన్ హీరో అని కుటుంబాన్ని ఎవరైతే ముందుకు నడిపిస్తారో ఆ ఇంటికి తనే పెద్ద కొడుకు లాగా ఈ కథకు కృష్ణ గారి నెంబర్ వన్ హీరో అంటూ సమాధానం చెప్పానని ఎస్వీ కృష్ణారెడ్డి వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…