Shruthi Hassan:తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తున్నటిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి శృతిహాసన్ ఒకరు.ప్రస్తుతం వరుస సినిమాలతో ఏమాత్రం తీరికలేకుండా బిజీగా గడుపుతున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇక కొన్నిసార్లు ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు. అయితే కొందరు చిరాకు కలిగించే ప్రశ్నలు అడిగినప్పటికీ ఈమె మాత్రం చాలా ఓపికగా సమాధానాలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో ఈమె పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ ప్రశ్నించడంతో ఎప్పుడూ ఇదే ప్రశ్ననా చాలా బోరింగ్ అంటూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటివేశారు. అయితే ఈమే ఇది వరకు తనకు పెళ్ళంటే భయం అంటూ ఎన్నో సార్లు సమాధానం చెప్పారు. అయితే మరొక నెటిజన్ మాత్రం ఈమెకు తగిలిన మోకాలి దెబ్బ గురించి ప్రశ్నించారు. ఇప్పుడు మీ మోకాలి యాంగిల్ ఎలా ఉంది అంటూ తనని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఆమె తన మోకాలి ఫోటోని షేర్ చేస్తూ కొద్దిగా వాచింది. అయితే ప్రస్తుతం తగ్గిందని నొప్పి కూడా లేదంటూ ఈమె తన మోకాలికి తగిలిన దెబ్బ గురించి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం శృతిహాసన్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మొదట్లోనే వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాలో నటిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…