Featured

Doctor Peddeswara Rao : కరోనా వాక్సిన్ వల్లే గుండె పోటు… చిన్నవయసులో గుండె పోటుకు కారణాలు ఇవే…: డాక్టర్ పెద్దేశ్వరరావు

Doctor Peddeswara Rao : 2020 నుండి కరోనా వ్యాధి ఎలా చుక్కలు చూపించిందో అందరికీ అనుభవమే. ఇక కరోనా వాక్సినేషన్ తరువాత కరోనా సోకదు అనుకున్నా మళ్ళీ కరోనా సోకి చాలా మంది మరణించారు కూడా. అయితే వాక్సిన్ వల్ల చాలా వరకు కరోనా కేసులు తగ్గాయనే చెప్పొచ్చు. అయితే మళ్ళీ చైనాలో కేసులు పెరగటంతో మళ్ళీ భారత్ లో కరోన గురించిన భయం మొదలయినా మనకు ఆ ఎఫెక్ట్ ఉండదని ప్రభుత్వం చెప్పడం కాస్త ఊరట కలిగించింది. అయితే కరోనా నీలి నీడలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నలభై ఏళ్లకే గుండెపోటుతో చాలా మంది మరణించడం కలవరపెడుతోంది. కరోనా ప్రభావం అలాగే వాక్సిన్ ప్రభావం వల్లే ఇలా ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి మరణిస్తున్నారనే వదంతుల నడుమ నిజానిజాలను డాక్టర్ పెద్దేశ్వరరావు చెప్పారు.

కరోనా వాక్సిన్ వల్ల గుండెనొప్పి…

కరోనా వ్యాధి ప్రభావం సోకిన తరువాత మూడు నెలలు ఉంటుందని, మనకు గుండెపోటు రావడానికి ప్రధాన కారణం గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాలు బ్లాక్ అవడం. కరోనా సమయంలో అది జరుగుతుంది కానీ అది కేవలం మొదటి మూడు నెలలు ఉంటుంది. అందుకే ఆ సమయంలో డాక్టర్లు ఏకోస్పిన్ టాబ్లెట్ ను రోగులకు అందిస్తారు. కారోనా అయిపోయి మనకు చాలా కాలం అయింది. అలాగే వాక్సినేషన్ వల్ల కూడా గుండె పోట్లు ఎక్కువవుతున్నాయి అన్న సందేహలకు డాక్టర్ పెద్దెశ్వరరావు గారు మాట్లాడుతూ అది కూడా అపోహ అంటూ తెల్చేశారు.

కరోనా వాక్సిన్ వేయించుకుంటే ఆ కరోనా పార్టీకల్స్ కొన్నింటిని మన శరీరంలోకి పంపి మన రోగ నిరోధక శక్తిని పెంచుతారు అదే వాక్సిన్ మెకానిజం. దానివల్ల గుండెపోటు రావడం అనేది అపోహ మాత్రమే. నిజానికి చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, మితి మీరిన కసరాత్తులు అలాగే నిద్ర సమయాలు కారణం అంటూ చెప్పారు. మొన్నటి పునీత్ రాజ్ కుమార్ నుండి నేటి తారకరత్న వరకు యువకులే మరణించడానికి మారిన జీవన సరళి కారణం అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago