S.V Krishna Reddy: పదేళ్ల తర్వాత వచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి లో ఏ మార్పు లేదుగా… అంత కక్కుర్తి అవసరమా?

S.V Krishna Reddy:ఎస్వీ కృష్ణారెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఈయన దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా స్క్రీన్ ప్లే రైటర్ గా, రచయితగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఈ విధంగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇలా ఈయన సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించడంతో అప్పట్లో నిర్మాతలు ఈయనకు ముందుగా అడ్వాన్సులు ఇచ్చే సినిమాలు చేయించుకునేవారు. అప్పట్లో ఈవివి సత్యనారాయణ వంటి డైరెక్టర్ కు పోటీగా కృష్ణారెడ్డి సినిమాలు ఉండేవని చెప్పాలి.అయితే ఇండస్ట్రీలోకి కొత్త డైరెక్టర్లు కొత్త టెక్నాలజీ రావడంతో ఈయన సినిమాలకు కాస్త ఆదరణ తగ్గింది.

ఇలా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించ లేకపోవడంతో ఈయన కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.దూరంగా ఉన్న పలు సినిమాలలో నటుడిగా నటిస్తూ మెప్పించారు. అయితే సుమారు పది సంవత్సరాల తర్వాత తిరిగి ఎస్వి కృష్ణారెడ్డి మెగా ఫోన్ పట్టారు.

ఇలా 10 సంవత్సరాలు తర్వాత ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలో కూడా ఈయన తన పాత ధోరణిని ఏమాత్రం మార్చుకోలేదు. ప్రస్తుతం యువత అభి రుచికి అనుగుణంగా కథను సిద్ధం చేసుకుని ఉండాలి. ఇలా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉండాలి అంటే కొత్త రచయితలను తీసుకొని తన కథను తీర్చిదిద్దుకోవాలి కానీ ఈయన అదే కక్కుర్తితో కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మ్యూజిక్ అన్నీ కృష్ణారెడ్డే చేసేశారు. 

S.V Krishna Reddy: అదే ధోరణిలో ఉన్న కృష్ణారెడ్డి…

ఇలా అన్నింటికీ తానే వ్యవహరించడంతో ఈయన చేసినటువంటి ఈ సినిమా కూడా మూడు రోజులకే దుకాణం సర్దాల్సి వచ్చింది.ఇలా స్క్రీన్ ప్లే డైలాగ్స్ మ్యూజిక్ అన్నింటిని ఇతరులతో కనుక చేయించి ఉంటే ఈ సినిమా అవుట్ పుట్ మరోలా ఉండేదని కానీ శ్రీకృష్ణారెడ్డి ఇంకా ఆ మూస ధోరణిలోనే ఉన్నారని పలువురు ఈయన వ్యవహార శైలి పై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.