శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఫిదా” సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన సాయి పల్లవి తన నటన ద్వారా అందరినీ ఆకట్టుకుంది. కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలపై ఆమె దృష్టి సారించింది.ఫిదా సినిమాతో మంచి హిట్ ని సంపాదించుకున్న సాయిపల్లవి వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తాజా చిత్రం “విరాట పర్వం”సినిమాలో హీరో రానా సరసన నటిస్తున్నారు.
తాజాగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సాయి పల్లవి, విరాట పర్వం సినిమాలో రానా పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. విరాట పర్వం సినిమాలో ఎంతో కీలకమైన పాత్రలో తను నటిస్తున్నారు. సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరోయిన్ ది కీలక పాత్ర అయినప్పటికీ ముందుగా హీరోయిన్ల పేర్లను పెట్టడానికి ఇష్టపడరు. కానీ విరాటపర్వం టైటిల్ కార్డ్స్ లో తన పేరు కంటే నా పేరే ముందు ఉండాలని రానా చెప్పారు. రానా సమానత్వానికి విశ్వసించే వ్యక్తి అని ఇంటర్వ్యూ ద్వారా సాయి పల్లవి రానా గురించి తెలిపారు.
రానా లాంటి ఒక మంచి వ్యక్తితో ఈ సినిమా చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలియజేశారు. అయితే ఈ రోజు రానా పుట్టిన రోజు కావడంతో విరాటపర్వం ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విరాటపర్వం ఫస్ట్లుక్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమాలో ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర, తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్య సరసన “లవ్ స్టోరీ” సినిమాలో కూడా నటిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…