రానా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి!

0
135

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఫిదా” సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన సాయి పల్లవి తన నటన ద్వారా అందరినీ ఆకట్టుకుంది. కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలపై ఆమె దృష్టి సారించింది.ఫిదా సినిమాతో మంచి హిట్ ని సంపాదించుకున్న సాయిపల్లవి వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తాజా చిత్రం “విరాట పర్వం”సినిమాలో హీరో రానా సరసన నటిస్తున్నారు.

తాజాగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సాయి పల్లవి, విరాట పర్వం సినిమాలో రానా పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. విరాట పర్వం సినిమాలో ఎంతో కీలకమైన పాత్రలో తను నటిస్తున్నారు. సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరోయిన్ ది కీలక పాత్ర అయినప్పటికీ ముందుగా హీరోయిన్ల పేర్లను పెట్టడానికి ఇష్టపడరు. కానీ విరాటపర్వం టైటిల్ కార్డ్స్ లో తన పేరు కంటే నా పేరే ముందు ఉండాలని రానా చెప్పారు. రానా సమానత్వానికి విశ్వసించే వ్యక్తి అని ఇంటర్వ్యూ ద్వారా సాయి పల్లవి రానా గురించి తెలిపారు.

రానా లాంటి ఒక మంచి వ్యక్తితో ఈ సినిమా చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలియజేశారు. అయితే ఈ రోజు రానా పుట్టిన రోజు కావడంతో విరాటపర్వం ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విరాటపర్వం ఫస్ట్లుక్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమాలో ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర, తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్య సరసన “లవ్ స్టోరీ” సినిమాలో కూడా నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here