Salaar Movie: కేజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. ఈ సినిమా పట్ల ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ డిసెంబర్ ఒకటో తేదీ రాత్రి 7:19 నిమిషాలకు విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా టీం ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించారు. మరి సలార్ టీం ప్రకటించిన ఆఫర్ ఏంటి అనే విషయానికి వస్తే…
ప్రభాస్ నటించిన సలార్ సినిమాని కే జి ఎఫ్ నిర్మాణ సంస్థ హోం భలే ఫిలిం మేకర్స్ నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ అధికారకంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకు ఆఫర్ ఇచ్చారు. బెస్ట్ 5 క్యాప్షన్లకు మీ దగ్గరలోని థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లతో పాటు సలార్ మెర్చండైజ్ కూడా గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. సలార్ సీజ్ ఫైర్ డిసెంబర్ 1 రాత్రి 7:19 కి రానుంది అంటూ ఈ విషయాన్ని షేర్ చేశారు.
ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్…
ఇలా సలార్ టీం బంపర్ ఆఫర్ ప్రకటించడంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ కోసం కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో జగపతిబాబు మలయాళీ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ వంటి టాప్ మోస్ట్ సెలబ్రిటీలు నటిస్తున్నారు. ఇక ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటించిన సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…