Movie News

Trisha: నా వయసు దేశానికి సమస్యగా మారిపోయిందా… బుద్ధి లేదా అంటూ ఫైర్ అయిన త్రిష?

Trisha: సినీ నటి త్రిష ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె పట్ల నటుడు మన్సూర్ ఆలీ చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా ఈమె వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి త్రిష సోషల్ మీడియా వేదికగా కొన్ని సోషల్ మీడియా వెబ్ సైట్ లపై తీవ్ర స్థాయిలోఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమె నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతున్నారు.

ఇలా 40 సంవత్సరాల వయసులో కూడా త్రిష పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇదే విషయం గురించి కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లో వార్తలను రాసాయి అయితే ఈ వార్తలపై త్రిష స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.గత కొంతకాలంగా నా వయసు గురించి వార్తలు రాస్తున్నా చూసి చూడనట్టు ఉన్నాను అయినా కూడా ఈ వార్తలు ఆగేలా లేవు అంటూ ఈమె స్పందించారు.

ప్రస్తుతం దేశానికి నా వయసే పెద్ద సమస్యగా మారిపోయింద. నేను నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థ డీలా పడిపోయింది. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి గురించి కాకుండా నా వయసు గురించి ఇలాంటి పిచ్చి రాతలు పిచ్చి వీడియోలు చేయటానికి సిగ్గుగా లేదా? కొందరు బుద్ధిలేని వాళ్లు చేస్తున్న న్యూసెన్స్ ఇది అంటూ ఈమె స్పందించారు.

అవే నాకు గర్వకారణం…

నేను నాలుగు పదుల వయసులో కూడా సినిమా అవకాశాలు అందుకోవడం కొందరికి జీర్ణించుకోలేని విషయంలా ఉందనిపిస్తోంది నేను ఒక నటిని చనిపోయే వరకు సినిమాలలో నటిస్తాను. సినిమాలలో నటించే వారికి వయసుతో సంబంధం లేదని, ఈ మాత్రం కామెన్ సెన్స్ లేకపోతే ఎలా, నా అందం అభినయ సామర్థ్యాలు నాకు గర్వకారణం అంటూ ఈ సందర్భంగా త్రిష చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

16 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

17 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago