Movie News

Salman Khan: సల్మాన్ ఖాన్ నైయో లగ్దా సాంగ్ డాన్స్ పై భారీ ట్రోలింగ్స్… ఎక్సర్ సైజ్ లా ఉందంటూ కామెంట్స్!

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే సల్మాన్ నటిస్తున్నటువంటి తాజా చిత్రం  ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’. ఇందులో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో విజయాన్ని అందుకున్నటువంటి వీరం సినిమాకి రీమేక్ చిత్రంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇకపోతే వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ విడుదల చేశారు. ‘నైయో లగ్దా’ అనే పాట వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయ్యింది. హిమేష్ రేష్మియా సంగీతం అందించిన ఈ పాట వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది.

ఇకపోతే ఈ పాటలో సల్మాన్ ఖాన్ చేసిన డాన్స్ ప్రస్తుతం నేటిజన్ల ట్రోలింగ్ కు గురయ్యేలా చేస్తోంది. ఈ పాటలో సల్మాన్ ఖాన్ డాన్స్ కొంచెం ఆడ్ గా ఉంది. అందుకే ట్రోలర్స్ కు ఫీస్ట్ అయిపోయింది. ఈ పాట కోసం సల్మాన్ చేసినటువంటి డాన్స్ మాదిరిగా లేదని జిమ్ లో చేసే ఎక్సర్సైజ్ లా ఉందంటూ నేటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు.

Salman Khan: డాన్స్ విషయంలో సల్మాన్ చాలా వీక్…

ఇక మరి కొంతమంది నేటిజన్స్ అయితే రెజ్లింగ్ నేపథ్యంలో రూపొందిన అమీర్ ఖాన్ దంగల్ చిత్రానికి ఈ పాటలో సల్మాన్ వేసిన స్టెప్పులు కరెక్ట్ గా సరిపోతాయని ఈ డాన్స్ వీడియో పై కామెంట్లో చేస్తున్నారు.నిజం చెప్పాలంటే సల్మాన్ ఖాన్ డాన్స్ విషయంలో కాస్త వీకనే చెప్పాలి.పైగా సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వయసు 5 పదులు దాటడంతో ఈ వయసులో పర్ఫెక్ట్ డాన్స్ చేయాలంటే కొంత కష్టమైన పని అని చెప్పాలి. ఏది ఏమైనా ప్రస్తుతం సల్మాన్ చేసినటువంటి ఈ డాన్స్ పై భారీగా ట్రోల్స్ జరుగుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago