Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే సల్మాన్ నటిస్తున్నటువంటి తాజా చిత్రం ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’. ఇందులో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో విజయాన్ని అందుకున్నటువంటి వీరం సినిమాకి రీమేక్ చిత్రంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇకపోతే వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ విడుదల చేశారు. ‘నైయో లగ్దా’ అనే పాట వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయ్యింది. హిమేష్ రేష్మియా సంగీతం అందించిన ఈ పాట వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది.
ఇకపోతే ఈ పాటలో సల్మాన్ ఖాన్ చేసిన డాన్స్ ప్రస్తుతం నేటిజన్ల ట్రోలింగ్ కు గురయ్యేలా చేస్తోంది. ఈ పాటలో సల్మాన్ ఖాన్ డాన్స్ కొంచెం ఆడ్ గా ఉంది. అందుకే ట్రోలర్స్ కు ఫీస్ట్ అయిపోయింది. ఈ పాట కోసం సల్మాన్ చేసినటువంటి డాన్స్ మాదిరిగా లేదని జిమ్ లో చేసే ఎక్సర్సైజ్ లా ఉందంటూ నేటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు.

Salman Khan: డాన్స్ విషయంలో సల్మాన్ చాలా వీక్…
ఇక మరి కొంతమంది నేటిజన్స్ అయితే రెజ్లింగ్ నేపథ్యంలో రూపొందిన అమీర్ ఖాన్ దంగల్ చిత్రానికి ఈ పాటలో సల్మాన్ వేసిన స్టెప్పులు కరెక్ట్ గా సరిపోతాయని ఈ డాన్స్ వీడియో పై కామెంట్లో చేస్తున్నారు.నిజం చెప్పాలంటే సల్మాన్ ఖాన్ డాన్స్ విషయంలో కాస్త వీకనే చెప్పాలి.పైగా సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వయసు 5 పదులు దాటడంతో ఈ వయసులో పర్ఫెక్ట్ డాన్స్ చేయాలంటే కొంత కష్టమైన పని అని చెప్పాలి. ఏది ఏమైనా ప్రస్తుతం సల్మాన్ చేసినటువంటి ఈ డాన్స్ పై భారీగా ట్రోల్స్ జరుగుతున్నాయి.































