Salman Khan: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే సల్మాన్ ఖాన్ కి ఉన్న గుర్తింపు వల్ల నిరంతరం అతనికి సెక్యూరిటీ చాలా అవసరం. ఇప్పటికే గుర్తు తెలియని వ్యక్తి సల్మాన్ ని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇలా అతనికి నిరంతరం థ్రెట్ ఉండటమే కాకుండా ఫ్యాన్స్ కూడా సల్మాన్ ఎక్కడికి వెళ్లినా.. వేలాదిగా తరలివస్తారు. దీంతో అతడిని హై సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
స్టార్ సెలబ్రిటీ అయిన సల్మాన్ ఖాన్‌కు నిరంతరం రక్షణ కల్పించటం పెద్ద పరీక్ష లాంటిది. అయితే గత 25 సంవత్సరాలుగా ఒక వ్యక్తి బాడీగార్డ్ గా ఉంటూ సల్మాన్‌కు ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. షేరా అనే వ్యక్తి గత 25 ఏళ్లుగా సల్మాన్‌కు బాడీగార్డ్ గా ఉంటూ అత్యంత నమ్మకస్థుడిగా పేరొందాడు . అయితే సల్మాన్ ఖాన్ కి బాడీగార్డ్ గా ఉండటం వల్ల అతను అందుకునే జీతం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్‌ఖాన్‌కి బాడీగార్డ్‌గా ఉండటం వల్ల షేరా అందుకునే జీతం నెలకు దాదాపు రూ. 15 లక్షలు . అంతే కాకుండా అతడు టైగర్ సెక్యూరిటీ సర్వీసెస్ స్టాపించి ప్రజంట్ దానికి సీఈఓగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సెక్యూరిటీ సంస్థ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోని హై-ప్రొఫైల్ సెలబ్రిటీలకు భద్రతను అందిస్తున్నాడు. షేరా ఇలా బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులకు భద్రతా సేవలను అందించడం ద్వారా భారీ ఆదాయాన్ని అర్జిస్తున్నాడు.
ఇలా సల్మాన్ ఖాన్ కి గత 25 సంవత్సరాలుగా బాడీగార్డ్ గా పనిచేయటమే కాకుండా సెక్యూరిటీ సంస్థ ద్వారా కూడా షేరా ఆర్థికంగా బాగా ఎదిగాడు. షేరా మొత్తం ఆస్తుల విలువ సుమారు 100 కోట్లుగా ఉన్నట్లు అంచనా. దీంతో సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ నెల జీతం, ఆస్తుల విలువ తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. దీంతో ఇప్పుడు షేరా ఒక సెలబ్రిటీగా మారాడు.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…