Movie News

అల్లు అర్జున్ తో పోల్చుకొని పరువు తీసుకున్న సల్మాన్ ఖాన్..!!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా చిత్రం రాధే..ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.. అయితే తాజాగా ఈ సినిమా విషయంలో సల్లూ భాయ్ అనవసరంగా ఉన్న పరువును పోగొట్టుకున్నాడని ఇప్పుడు ఆయన అభిమానులే తెగ ఫీల్ అయిపోతున్నారు. మొదటినుండి సల్మాన్ ఇంతే.. తనకు రాని దాన్ని చేయడానికి ప్రయత్నం చేసి.. వచ్చిన దాన్ని వదిలేస్తూ ఉంటాడు.

ఇప్పుడు కూడా అదే చేశాడు అంటూ సల్లూ భాయ్ ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు.ఇంతకీ సల్మాన్ చేసిన నిర్వహం ఏమిటంటే..డీజే’లో అల్లు అర్జున్ చేసిన డ్యాన్స్ ను సల్మాన్ ఖాన్ తన ‘సీటిమార్’ సినిమాలో వేయడం. అయినా బన్నీ వేసిన స్టెప్పులను సల్మాన్ వేయాలనుకోవడం.. చివరకు వేయలేక తేలిపోవడం చకచకా జరిగిపోయాయి. నిజానికి సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా ‘రాధే’లో సీటీ మార్ సాంగ్ ని పెడుతున్నాడని తెలిసినప్పుడే బాలీవుడ్ సినీ మీడియా హెచ్చరించింది.

సల్మాన్ ఖాన్ కి డ్యాన్స్ రాదు అని.. అతను ఎక్కువగా ప్యాంటుకున్న బెల్ట్ ని కిందికి, పైకి ఊపే బెల్ట్ స్టెప్పులు వేయగలడు ఏమో గానీ, నిజమైన మాస్ స్టెప్ లను వేయలేడు అని, ముఖ్యంగా బన్నీలా కష్టమైన స్టెప్స్ అసలు వేయలేడు అని తేల్చి చెప్పింది. తీరా మీడియా చెప్పినట్టే జరిగింది. మొత్తానికి పాట బయటికొచ్చిన తరువాత గానీ, సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కి అసలు విషయం అర్ధం కాలేదు.మరోపక్క యాంటీ ఫ్యాన్స్ బన్నీ స్టెప్స్ ను సల్మాన్ స్టెప్స్ ను పక్కపక్కనే పెట్టి పోల్చుకుంటూ తెగ కామెడీ చేసేస్తున్నారు.

పైగా సల్మాన్ స్టెప్స్ ను క్లోజ్ షాట్ లో చూస్తుంటే.. వాంతి వొస్తుంది అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. పాపం సల్మాన్ ఉన్న పరువును కూడా పోగొట్టుకున్నాడు. అయినా ఇలా పరువు తీసుకోవడం సల్మాన్ భాయ్ కి కొత్తేమి కాదు,ఆయన తన సినీ కెరీర్ మొదటి నుండి స్టార్ అయిన తరువాత కూడా పరువు తీసుకునే పనిని ఒక ఆనవాయితీగా పెట్టుకున్నట్టు ఉన్నాడు ఈ బాలీవుడ్ కండల వీరుడు..!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago