Categories: General News

Air India పైలట్కు సెల్యూట్.. ప్రమాద సమయంలో చూపిన ధైర్యం గొప్పది! ప్రత్యక్ష సాక్షి ఏమంటున్నాడంటే?

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. దాదాపు 240 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన గురువారం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ A-171 విమానం, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది.

Salute to Air India pilot.. What does the eyewitness say?

విమాన ప్రమాదం సమయంలో పైలట్ తీసుకున్న యత్నం గురించి ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ‘‘మేఘానీ నగరంలో మొదట బస్టాండ్‌పై విమానం ల్యాండ్ అవుతుందనుకున్నాం. కానీ పైలట్ చివరి నిమిషంలో విమానాన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. ఓ ఖాళీ స్థలంలో ల్యాండ్ చేయాలని ప్రయత్నించారు. కానీ అక్కడ వేప చెట్టు, హాస్టల్ బిల్డింగ్ అడ్డంకిగా మారాయి’’ అని చెప్పారు.

చివరకు, విమానం వేప చెట్టును తాకిన వెంటనే అదుపు తప్పి, బీజే మెడికల్ కాలేజీ డాక్టర్ల హాస్టల్ భవనంపై కూలిపోయిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు, ప్రత్యక్ష వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ప్రమాద సమయంలో పైలట్ చేసిన ప్రయత్నానికి నెటిజన్లు, ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. “అతని ధైర్యం, శ్రమ వృథా కాకూడదని అనిపిస్తోంది. చివరి వరకు ప్రయాణికుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశాడు” అంటూ పలువురు కంటతడి పెట్టారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago