Naga Chaitanya - Samantha: సమంత - చైతన్య అభిమానులు ఆ విషయంలో ఆశలు అనవసరం.. ఎవరు ఆశలు పెట్టుకోవద్దు!
Naga Chaitanya – Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సమంత నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు గత ఏడాది అక్టోబర్ 2వ తేదీ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. అప్పటికే ఈ జంట సుమారు రెండు నెలలపాటు విడిగా ఉంటున్నారు.
ఇలా గత ఆరు నెలల నుంచి వీరిద్దరూ విడి విడిగా ఉంటూ వారి కెరియర్ పై ఫోకస్ చేశారు. అయితే ఈ జంట తిరిగి కలిస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ వీరిద్దరూ తిరిగి కలవాలని కోరుకున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వీరు చేసే పోస్టులు బట్టి చూస్తుంటే వీరిద్దరు కలవరని అర్థమైంది.
ఈ విషయంలో ఇరు కుటుంబాల సభ్యులు కూడా వీరికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇలాంటి సమయంలోనే సమంత తన విడాకులకు సంబంధించిన పోస్ట్ ను డిలీట్ చేయడంతో ప్రతి ఒక్కరూ మరి వీరిద్దరూ కలుస్తారా అని ఆశలు పెట్టుకున్నారు. అయితే నాగచైతన్య వైపు నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో సమంత ఈ పోస్ట్ అనవసరమని డిలీట్ చేశారని భావించారు.
ఇప్పటికే వీరి విడాకుల గురించి లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. ఆ ప్రాసెస్ కూడా పూర్తయితే పూర్తిగా అధికారికంగా వీరిద్దరూ విడాకులు తీసుకుని ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య అభిమానులు వీరిద్దరూ కలుస్తారని ఆశల పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇక వీరిద్దరూ కలిసే అవకాశం లేదని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…