Samantha: సినీనటి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మరణించిన విషయం మనకు తెలిసిందే .ఇలా తన తండ్రి మరణ వార్తను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా తన తండ్రి మరణించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా ఈమె హార్ట్ బ్రోకెన్ సింబల్ కూడా షేర్ చేశారు. ఇలా సమంత తండ్రి మరణించారనే విషయం తెలియగానే ఎంతోమంది అభిమానులు ఈమె కుటుంబానికి సానుభూతి తెలుపుతూ పోస్టులు చేశారు.
సమంత ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ముఖ్యంగా తన ప్రేమ పెళ్లి విడాకులు అనే విషయాలు సమంత. ఇప్పుడిప్పుడే ఈ విషయాల నుంచి బయటపడుతున్న ఈమెకు తన తండ్రి మరణం తీరని లోటుగా మిగిలిపోయింది.
ఇకపోతే తాజాగా ఈమె తన తండ్రికి సంబంధించి మరొక పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. నా మొదటి సినిమా ఏ మాయ చేసావే మంచి సక్సెస్ అయినప్పుడు ఆ విజయాన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. మనసులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మీరు అండర్ అచీవర్, లేదా మీరు ఈ విజయం, ప్రశ్నలన్నింటికీ అర్హులు కాదు అని అన్నారు. ఆ రెండో మాటనే మనసులో పెట్టుకున్నాను. కెరీర్ మొదట్లో నా లుక్స్ నటనపై నాకే అనుమానం ఉండేది.
నేను ఈ ప్రశంసలకు అర్హురాలిని అని నన్ను నేను నేను ఒప్పించుకోవడానికి 10-12 సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో మా నాన్న జోసెఫ్ ప్రభు మాటలు నన్ను మరింత బలంగా మార్చాయి. ఇండస్ట్రీలో, నా వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న పోరాటాలకు నా తండ్రి అండగా నిలిచారు అంటూ సమంత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…