Samantha: నాగచైతన్య, సమంత ఈ జంటకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏ మాయ చేసావే సినిమాతో ఏర్పడిన ఈ వీరి పరిచయం ప్రేమగా మారి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి వైవాహిక జీవితం నాలుగు సంవత్సరాల పాటు అన్యోన్యంగా కొనసాగిన అనంతరం విడాకులు తీసుకుని విడిపోయారు.ఈ విధంగా విడాకులతో విడిపోయిన ఈ జంట గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఇకపోతే విడాకుల తర్వాత చాలా మంది తప్పు సమంతదే అంటూ దారుణంగా తన గురించి ఎన్నో కామెంట్లు చేశారు. అయితే తన గురించి ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ సమంత విడాకులకు గల కారణం తెలియజేయడం లేదు. ఇకపోతే సమంత తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు.
ఈ టాక్ షోలో భాగంగా ఈమె విడాకుల గురించి చెప్పాల్సిన సమయం వచ్చిందని అందరూ భావించారు.
అనుకున్న విధంగానే నిర్మాత కరణ్ సమంత విడాకుల గురించి ప్రశ్నించగా ఈమె ఆ విషయాన్ని దాటివేసి విడాకుల తర్వాత తన జీవితం చాలా కష్టంగా మారింది అంటూ ఎమోషనల్ అయ్యారు. విడాకుల ప్రక్రియ అంత సులభంగా ఏమీ జరగలేదంటూ సమంత షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను కానీ ప్రస్తుతం పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. నేను బలంగా మారాను అంటూ సమంత విడాకుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.ఇకపోతే డబ్బు కోసం మీరు ఎలాంటి పనులు చేయరనే విషయాన్ని ప్రశ్నించగా తాను సినిమాలతో పాటు ఎన్నో పనులను డబ్బు కోసం చేయడం లేదని ఈ సందర్భంగా ఈమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ టాక్ షోలో సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…