Samantha: ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో నేడు పాన్ ఇండియా లెవెల్ లో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి సమంత.ఈమె అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్ లో ఎంతో ముందుకు వెళ్తున్నారు. అయితే విడాకుల తర్వాత సమంత పబ్లిక్ ప్లేస్ లో అయినా లేదా సోషల్ మీడియా వేదికగా అయినా తాను చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా సమంత చెన్నైలోనే సత్యభామ యూనివర్సిటీకి వెళ్లి అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సమంత విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. నేను చదువుకునే రోజుల్లో మా అమ్మ నాన్న నన్ను ఎంతో కష్టపడి చదివించారు.తనని ఒక గొప్ప స్థాయిలో చూడాలని అమ్మ నాన్నలు కలలు కన్నారు. నేను కూడా వారి కళలను నెరవేర్చే దిశగా పది 12 తరగతులలో టాపర్ గా నిలిచాను.
ఇక ఉన్నత చదువులు చదవడం కోసం మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో తాను కన్న కలలను కలలుగానే మిగిలిపోయాయని ఈమె తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ఆశించే మార్గంలో నడవడమే కాకుండా మీకంటూ ఓ గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించేవరకు ప్రయత్నాలు చేయాలని ఈమె విద్యార్థులకు మోటివేట్ చేశారు.
ఈ క్రమంలోనే తాను కూడా కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి సమంత వెల్లడించారు. కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడంతో డబ్బు కోసం తాను ఎన్నో చిన్నచిన్న ఉద్యోగాలు చేశానని సమంత వెల్లడించారు.ఇక రెండు నెలల పాటు కేవలం ఒక్క పూట భోజనం చేసే బ్రతకానని అలాంటి కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాను కనుక ఈ స్థాయిలో ఉన్నానంటూ సమంత ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…