Featured

Samantha : ‘సెకండ్ హ్యాండ్ ఐటెం’ అంటూ దారుణమైన ట్రోలింగ్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సమంత !

నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత‌కు విమ‌ర్శ‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెను ట్రోల్ చేస్తూ ఆమెపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. అక్టోబర్ 2, 2021 న విడాకుల ప్రకటనను వెల్లడించారు. 6 నెలల్లో అంటే.. ఏప్రిల్ వ‌ర‌కు వీరికి విడాకులు మంజూరు అవుతాయ‌ని తెలుస్తోంది.

Samantha : ‘సెకండ్ హ్యాండ్ ఐటెం’ అంటూ దారుణమైన ట్రోలింగ్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సమంత !

ఇక విడాలకుల ప్రకటన చేసి దాదాపు రెండు నెలలు దాటినప్పటికీ ఇప్పటికీ ఆ విషయం హాట్ టాపిక్ గానే మారింది. ప్రేమించి.. పెళ్లి చేసుకొని.. టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరుతెచ్చుకున్న ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో కారణం మాత్రం చెప్పలేదు. చాలామంది సమంతను తప్పుపడుతూ వార్తలు కూడా వచ్చాయి.

Samantha : ‘సెకండ్ హ్యాండ్ ఐటెం’ అంటూ దారుణమైన ట్రోలింగ్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సమంత !

ఇప్పటికీ కూడా కొందరు ఆమెని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా స‌మంత‌పై ఓ నెటిజ‌న్ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశాడు. స‌మంత డైవోర్స్ తీసుకున్న ఓ సెకండ్ హ్యాండ్ ఐట‌మ్ అని.. ఓ మంచి వ్య‌క్తి నుంచి రూ.50 కోట్ల ట్యాక్స్ ఫ్రీ డ‌బ్బును దోచేసింద‌ని.. ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కు సమంత స్పందించి.. రిప్లై ఇచ్చింది. అందుకే ఈ ట్వీట్ పెద్ద వైరల్ గా మారింది.

Samantha : సోషల్ మీడియా ట్రోలింగ్ పై సమంత ఘాటు రిప్లై..

సాధారణంగా సమంతపై నెగెటివ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. కానీ ఇలా ఆమె ఈ కామెంట్ కు స్పందించడంతో.. సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. స‌ద‌రు నెటిజ‌న్ పేరును ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘గాడ్ బ్లెస్ యువ‌ర్ సోల్’ అని పేర్కొంది. దీంతో ఈ కామెంట్ వైరల్ గా మారగా.. ఇటువంటి వాటికి సమంత స్పందించాల్సిన అవసరం ఏముందంటూ.. సమంత అభిమానులు సపోర్ట్ గా మాట్లాడారు. ఈ మ‌ధ్యే ఆమె పుష్ప మూవీలో ఊ అంటావా మావా.. ఊహు అంటావా మావా.. అనే ప్ర‌త్యేక సాంగ్‌లో న‌టించి అలరించిన విషయం తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago