Featured

Ravi teja : బాలయ్య టాక్ షోలో డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయిన రవితేజ..

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాలో భారీ హిట్ కొట్టాడు. బాక్సాఫీస్ వద్ద అఖండ సినిమా వసూళ్ల కిక్ ఇచ్చింది. ఇటు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటిన బాలయ్య బాబు.. ఓటీటీలో కూడా దుమ్ము రేపుతున్నాడు. ఇటీవల ఆహా ఓటీటీలో మొదలైన ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ టాక్ షో సక్సెస్ అయింది. తొలి షోలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో చేసిన  టాక్ షో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.

Ravi teja : బాలయ్య టాక్ షోలో డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయిన రవితేజ..

షోలో బాలకృష్ణ ఎనర్జీ లెవల్స్ పీక్స్ లో ఉంటున్నాయి. గెస్ట్ లుగా వచ్చినవారు బాలయ్య బాబు సందడి చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.  ఈ షో ద్వారా ఇప్పటికే మెహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి వంటి వారితో సరదాగా ముచ్చటించారు బాలకృష్ణ. ప్రస్తుతం ఈ టాక్ షోలో ప్రముఖ తెలుగు నటుడు రవితేజ కనిపించనున్నారు.

Ravi teja : బాలయ్య టాక్ షోలో డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయిన రవితేజ..

తనపై పెట్టిన డ్రగ్స్ కేసు గురించి వివరించిన రవితేజ

షో రూపకర్తలు నటుడు రవితేజ, ‘క్రాక్’ చిత్ర దర్శకుడు గోపీచంద్ మల్లినేని ఫీచర్ చేసిన ప్రోమో వీడియోను విడుదల చేశారు. డ్రగ్స్ కేసు తనపై ఎలాంటి ప్రభావం చూపిందో మాస్ మహారాజా నటుడు వీడియోలో వెల్లడించాడు. టాక్ షోలో డ్యాన్స్ కూడా చేశాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని తనను అరెస్ట్ చేసిన సందర్భం ఒకటి బయటపెట్టారు. ఈ సంభాషణలో బాలయ్య.. గోపీచంద్ తో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి ప్రోమో వైరల్ కాగా.. ఫుల్ ఎపిసోడ్ ఈ నెల 31 న విడుదల కానుంది. అన్‌స్టాపబుల్ మొదటి సీజన్‌లో 12 ఎపిసోడ్‌లు ఉంటాయి . తదుపరి ఎపిసోడ్‌ల షూట్‌ను త్వరలో పూర్తి చేయాలనే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో గోపీచంద్ మలినేని సినిమా సెట్స్‌లో బాలయ్య జాయిన్ అవ్వనున్నాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago