భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేదీలు ఎన్నో వివాదాల మధ్య ఖరారయ్యాయి. ముందుగా ప్రకటించిన విధంగా జనవరి 7న RRR వస్తుందని ఇప్పటికే స్పష్టం చేయగా.. భీమ్లానాయక్ విడుదల తేదీని వాయిదా వేశారు.
సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా.. ఫిబ్రవరి 23న విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో ఎఫ్3 విడుదల తేదీ కూడా కాస్త వెనక్కు జరిగింది.
ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఎఫ్3.. ఏప్రిల్ 29 కు వాయిదా పడిపోయింది. ఇక దీనిలో రాధేశ్యామ్ చెప్పిన విధంగానే సంక్రాంది బరిలో దిగుతోంది. ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదే విషయాన్ని దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేస్తూ.. విడుదల తేదీలను సర్దుబాటు చేసినందుకు రెండు వేర్వేరు ట్వీట్లలో మహేష్ బాబు , పవన్ కళ్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు జక్కన్న. మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ గురించి రాజమౌళి చేసిన ట్వీట్ చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులకు అంతగా నచ్చలేదు.
రాజమౌళి సర్కారి వారి పాటను ‘పర్ఫెక్ట్ పొంగల్ చిత్రం’గా పేర్కొన్నాడు. ఇది భీమ్లా నాయక్ అభిమానులను నచ్చకపోవడంతో.. రాజమౌళిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. భీమ్లా నాయక్ సంక్రాంతికి విడుదలకు అర్హతలేని సినిమానా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే సినిమా వాయిదా వేయడం వెనుకు దిల్ రాజ్ హస్తం ఉందని.. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అవుతుందని.. సర్కారు వారి పాట, భీమ్లానాయక్ లను వాయిదా వేయించడం ఏంటని మండిపడుతున్నారు.
ఇక చివరగా భీమ్లా నాయక్ వాయిదా నిర్ణయంపై ఈ స్టార్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ , చినబాబులకు ధన్యవాదాలు తెలిపారు. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని.. ఎఫ్3 సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉందని అందుకే వాళ్లు సినిమా వాయిదాపడిన పెద్దగా నష్టం లేదని.. తమ అభిమాన నటుడి సినిమా భీమ్లానాయక్ సినిమా అన్నీ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉండగా.. చివరి నిమిషంలో ఇలా చేయడం భావ్యం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ అభిమానులు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…