నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంతకు విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తూ ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే ఉన్నారు. అక్టోబర్ 2, 2021 న విడాకుల ప్రకటనను వెల్లడించారు. 6 నెలల్లో అంటే.. ఏప్రిల్ వరకు వీరికి విడాకులు మంజూరు అవుతాయని తెలుస్తోంది.

ఇక విడాలకుల ప్రకటన చేసి దాదాపు రెండు నెలలు దాటినప్పటికీ ఇప్పటికీ ఆ విషయం హాట్ టాపిక్ గానే మారింది. ప్రేమించి.. పెళ్లి చేసుకొని.. టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరుతెచ్చుకున్న ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో కారణం మాత్రం చెప్పలేదు. చాలామంది సమంతను తప్పుపడుతూ వార్తలు కూడా వచ్చాయి.

ఇప్పటికీ కూడా కొందరు ఆమెని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా సమంతపై ఓ నెటిజన్ పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. సమంత డైవోర్స్ తీసుకున్న ఓ సెకండ్ హ్యాండ్ ఐటమ్ అని.. ఓ మంచి వ్యక్తి నుంచి రూ.50 కోట్ల ట్యాక్స్ ఫ్రీ డబ్బును దోచేసిందని.. ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కు సమంత స్పందించి.. రిప్లై ఇచ్చింది. అందుకే ఈ ట్వీట్ పెద్ద వైరల్ గా మారింది.
Samantha : సోషల్ మీడియా ట్రోలింగ్ పై సమంత ఘాటు రిప్లై..
సాధారణంగా సమంతపై నెగెటివ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. కానీ ఇలా ఆమె ఈ కామెంట్ కు స్పందించడంతో.. సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. సదరు నెటిజన్ పేరును ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘గాడ్ బ్లెస్ యువర్ సోల్’ అని పేర్కొంది. దీంతో ఈ కామెంట్ వైరల్ గా మారగా.. ఇటువంటి వాటికి సమంత స్పందించాల్సిన అవసరం ఏముందంటూ.. సమంత అభిమానులు సపోర్ట్ గా మాట్లాడారు. ఈ మధ్యే ఆమె పుష్ప మూవీలో ఊ అంటావా మావా.. ఊహు అంటావా మావా.. అనే ప్రత్యేక సాంగ్‌లో నటించి అలరించిన విషయం తెలిసిందే.
Kamarali Dukandar God bless your soul . https://t.co/IqA1feO9K1
— Samantha (@Samanthaprabhu2) December 21, 2021































