అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయనున్నారు. అన్నింటిని ఒకేరోజు రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్ను ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల చేశారు. అవి యూట్యూబ్ ఓ సెన్సేషనల్ హిట్ ను అందుకున్నాయి. ఇక ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉండబోతోందట. దానిలో సమంత ఈ సాంగ్ చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. దాని కోసం అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్ సెట్ కూడా వేశారని, వచ్చే వారం ఈ పాటని షూట్ చేస్తారని సమాచారం.
ఈ పాట కోసం సమంత ఏకంగా రూ.కోటి డిమాండ్ చేసినట్లు సమాచారం. సమంత ఈ సినిమాలో కనపడితే .. సినిమాకు కాస్త మైలేజ్ వస్తుందనే నమ్మకంతో వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక సుకుమార్ దర్శకత్వంలో సమంత రంగస్థలం సినిమాలో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక అల్లు అర్జున్ సరసన సమంత సన్ ఆఫ్ సత్యమూర్తిలో జోడీగా నటించింది. ఈ అప్ డేట్ వినగానే అభిమానులు ఆ పాట కోసం వెయిట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఐ యామ్ వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే సమంత శాకుంతలం సినిమాలో నటిస్తుండగా.. ఆమెకు బాలీవుడ్ లో కూడా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…