సమంత, అక్కినేని నాగచైతన్య మధ్య విడాకుల వ్యవహారం గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఆమెకు భరణంగా దాదాపు రూ.240 కోట్లు కూడా ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. వాళ్ల మధ్య మనస్పర్థలు పెరిగాయని.. సామ్, చైతు పెళ్లి రోజునే విడాకులతో పాటు.. భరణం కూడా అప్పజెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.
అయితే ఈ విడాకుల వ్యవహారం నిజమే అని తేలడంతో.. అక్కినేని నాగార్జున ఫ్యామిలీ ఆమెకు భరణం కింద డబ్బులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అయితే ముందుగా వినిపించిన వార్తల్లో రూ.240కోట్లు కాకుండా రూ.100 నుంచి 200 కోట్ల మధ్య ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ డబ్బులను సమంత తిరస్కరించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలను సమంత సన్నిహిత వర్గాలు చెబుతున్నట్లు సమాచారం.
సమంత డబ్బును చూసి నాగచైతన్యను పెళ్లి చేసుకోలేదని.. కేవలం ప్రేమను చూసి మాత్రమే కోరుకుందని.. అలాంటి ప్రేమకు డబ్బుతో ముడి పెట్టకండి అంటూ ఆమె సన్నిహితులు అన్నట్లు వార్త వైరల్ అవుతోంది. అంతేకాదు విడాకుల విషయం కేవలం వ్యక్తిగతం అంటూ కూడా చెప్పుకొచ్చారు. వాళ్లిద్దరు సెలబ్రిటీలు కావడంతో ఇలా ఈ న్యూస్ ఎక్కువగా బయటకు వచ్చిందని.. అందుకు జనాల్లో ఎక్కువగా ఆసక్తి రేపిందని కూడా చెప్పుకొచ్చారు.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో చాలామంది విడాకులు తీసుకునన్నారు.. వాళ్లకు సంబంధించి భరణం తీసుకున్నారా.. లేదా అనేది విషయం బయటకు రాలేదు.. ఇది కూడా అలాంటిదే అన్నట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటూ సమంత నోరు విప్పాల్సిందే.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…