Samantha-Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సమంత గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇలా ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన తెలియకపోవడంతో ఇదంతా ఆ వాస్తవమని అభిమానులు భావించారు.
ఇకపోతే తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. దీంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు అభిమానులు సమంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సమంత ఈ విధమైనటువంటి వ్యాధితో బాధపడుతుందని తెలియగానే అక్కనేని కుటుంబం నుంచి అఖిల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తన క్షేమంగా కోలుకోవాలని పోస్ట్ చేశారు కానీ నాగచైతన్య మాత్రం ఈ విషయం తెలియగానే హాస్పిటల్ కి వెళ్లి సమంతను పరామర్శించి తనకు ధైర్యం చెప్పారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ విధంగా నాగచైతన్య సమంత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే అసలు నిజం ఏమిటంటే సమంత ఈ వ్యాధి గురించి ప్రకటించినప్పుడు ఆమె హాస్పిటల్ లో లేదని ఇంట్లోనే చికిత్స తీసుకుంటుందని తెలుస్తోంది.ఇక నాగచైతన్య తనను పరామర్శించడానికి హాస్పిటల్ కు ఎలా వెళ్తారు అంటూ మరికొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నాగచైతన్య హాస్పిటల్ కు వెళ్లి ఉంటే హాస్పిటల్ లోని సీసీ కెమెరాలలో అయినా కానీ ఆయన కనిపించేవారు కదా అంటూ మరికొందరు లాజిక్కులు వెతుకుతున్నారు. మొత్తానికి సమంతను పరామర్శించడానికి నాగచైతన్య వెళ్లారు అనేది కేవలం ఆ వాస్తవం మాత్రమేనని తెలుస్తోంది.
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్‌కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్‌లో మైలురాయిగా నిలిచిన…
ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…