Samantha: సమంత కీలక పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే ప్లాప్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను నిరాశపరిచింది.
ఈ సినిమాలో సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ మోహన్ నటించి ఆకట్టుకున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవ్ మోహన్ సినిమా విశేషాలతో పాటు సమంతతో రొమాన్స్ గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా దేవ్ మాట్లాడుతూ.. ” ఈ సినిమాలో టాప్ స్టార్స్‌తో కలిసి నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ నన్ను ఎక్కువగా ఎక్జ్సైట్ చేసేది స్క్రిప్ట్ మాత్రమే. . నేను కథకు కనెక్ట్ అయితేనే సినిమాలో నటిస్తాను’ అని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత సమంతకి జోడిగా నటించడం గురించి మాట్లాడుతూ .. ‘నా కెరీర్‌లో మూడవ చిత్రం శాకుంతలం. ఈ సినిమాలో సమంతతో కలిసి నటించడం గొప్ప విషయం అంటూ వెల్లడించాడు.
అలాగే సమంత గురించి మాట్లాడుతూ…”ఆమె ఎప్పుడూ కో స్టార్‌ని ప్రోత్సహిస్తుంది. కో స్టార్ నాకు తొలి ప్రేక్షకులు అని నేను నమ్ముతాను, వారి నుంచి వచ్చే సూచనలు నాకు చాలా ఉపయోగపడతాయి.
ఇక రొమాంటిక్ సన్నివేశాలలో సమంతతో నటించటం నాకు ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే ఆ సన్నివేశాలలో నాకు సమంత కాకుండా శకుంతల మాత్రమే కనిపించింది . అందువల్ల రొమాంటిక్ సన్నివేశాలలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నటించగలిగాను అంటూ దేవుని మోహన్ చెప్పుకొచ్చాడు. ఈ సన్నివేశాలలో నటించేటప్పుడు నేను నర్వస్ ఫీల్ కాలేదని దేవ్ మోహన్ తెలిపారు
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…