Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక విడాకుల తర్వాత ఈమె ఎన్నో విభిన్న కథ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా సందడి చేసిన సమంత హరి హరీష్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న యశోద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా కోసం సమంత తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం సమంత భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
ఈ సినిమా కోసం సమంత ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వకుండా కేవలం 50 కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చారని అయితే 50 కాల్ షీట్ల కోసమే సమంత ఏకంగా 2.75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సమంత ఇంతకన్నా ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమాలు ఉన్నప్పటికీ అతి తక్కువ కాల్ షీట్స్ కోసం ఈమె తీసుకున్న రెమ్యూనరేషన్ లో ఇదే హైయెస్ట్ అని తెలుస్తుంది.
ఇక యశోద సినిమా లేడీ ఓరియంటెడ్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది.ఇక తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను సినిమాపై భారీ అంచనాలు పెంచుతూ ఉత్కంఠతకు గురిచేస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు ఈమె శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా కూడా వ్యక్తులకు సిద్ధమవుతుంది..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…