Featured

Sudeepa : అతని వల్ల నాలుగేళ్లు నరకం అనుభవించాను… తినడానికి తిండికి కూడా ఉండేది కాదు. : బిగ్ బాస్ సుదీప

Sudeepa : సుదీప అని చెప్పేకంటే పింకీ అని చెప్తే అందరూ గుర్తుపడతారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో హీరోయిన్ చెల్లి గా పింకీ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అప్పటి నుండి పింకీ గానే అందరికీ తెలిసిన సుదీప అందరి హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఇక సినిమాలకు గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం సీరియల్స్ లోనూ అలరిస్తున్న సుదీప ఈ సీజన్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొంటోంది. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి తాజాగా బిగ్ బాస్ కి వెళ్లే ముందు ఇంటర్వ్యూ ల్లో చెప్పిన సుదీప తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పింది.

ఇంట్లో ఒప్పుకోకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాను…

సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సుదీప కొంతకాలానికి సినిమాలకు గ్యాప్ ఇచ్చి చదువుకుంది. ఇక శ్రీ రంగనాథ్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ప్రేమించిన సుదీప పెద్దలు ఒప్పుకోకపోవడంతో చాలా ఇబ్బంది పడినట్లు చెప్పింది. ఇంట్లో తల్లిదండ్రులను పెళ్లి విషయంలో ఒప్పించడానికి నాలుగేళ్లు పట్టిందంట, ఆ సమయంలో ఇంట్లో తిండి తినకుండా కొంచెం తింటూ రెండు మూడు రోజులు గడిపిన రోజులు కూడా ఉన్నాయని చెప్పింది.

ఇక అదే సమయంలో ఇంట్లో సంబంధాలు చూడటం, నేను వాటిని ఇష్టం లేదని చెప్పడం, ఇంట్లో గొడవ జరగడాలు లాంటివి జరిగాయి. ఇక చివరకు ప్రేమించిన వ్యక్తితో పెళ్ళికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఆ తరువాత పెళ్లి చేసుకున్నాం అంటూ తన ప్రేమ కష్టాలను చెప్పింది. ఇక పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్న సుదీప, సీరియల్స్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు మాత్రం దగ్గరాగానే ఉంది. ఇక మళ్ళీ ఇంతకాలానికి బిగ్ బాస్ ద్వారా మళ్ళీ ప్రేక్షకులకు చేరువయింది సుదీప.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago