Samantha: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సమంత ఇటీవల శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే సినిమా విడుదలైన మొదటి రోజు నుండి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సమంత కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోయింది.
ఈ రేంజ్ ఫెయిల్యూర్ ఆమెకు ఈ పదేళ్లలో ఎదురుకాలేదు. పైగా శాకుంతలంలో ఆమె లీడ్ రోల్ లో నటించటం వల్ల సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఆమె బాధ్యత వహించాల్సిందే. సినిమా మీద హైప్ క్రియేట్ చేయటానికి సినిమా యూనిట్ చాలా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో సమంత సింపతీ కార్ట్ కూడా వాడారనే వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా ప్రమోషన్స్ సమయంలో సమంత అనారోగ్యం గురించి మాట్లాడటం కన్నీళ్లు పెట్టుకోవడం కూడా సినిమాని సక్సెస్ చేయటానికి చేసిన ప్రయత్నమే అని కొందరు ఎద్దేవా చేశారు.
సమంత ఎంత ఏడ్చినా కూడా సినిమా బాగా లేకపోతే ప్రేక్షకులు పట్టించుకోరు. ఈ క్రమంలో సమంత తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ సినిమాలో శకుంతలగా ఆమె నటన, డబ్బింగ్ కూడా పేలవంగా ఉన్నాయని టాక్ . తాజాగా సినిమా ఫెయిల్యూర్ గురించి పరోక్షంగా బాధ్యత వహించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మహాభారతంలోని ఒక శ్లోకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహాభారతంలోని శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత నుండి …
‘కర్మణ్యే వాధికా రాస్తేమా ఫాలేషు కదాచన
మా కర్మ ఫల హే తుర్ భూః
మా తే సంగోత్స్వ కర్మణి..’ శ్లోకాన్ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంటే ప్రయత్నం చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. కానీ దాని ఫలితం మాత్రం మనం నిర్ణయించలేము. ఫలితాలకు భయపడి ప్రయత్నం చేయడం మానకుండా… ఏదేమైనా ముందుకు సాగిపోవాలని అర్థం . అంటే సినిమా ప్లాప్ అయ్యిందని బాధ పడకుండా ముందుకు సాగిపోవాలని పరోక్షంగా వెల్లడించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…