Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమంత ప్రస్తుతం కెరియర్ కు కాస్త విరామం ప్రకటించి తన ఆరోగ్యాన్ని కాపాడుకునే పనులలో ఉన్నారు.. సమంత మయోసైటిసిస్ వ్యాధికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఈమె సినిమాలకు కాస్త విరామం ప్రకటించి పూర్తిగా ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సమంత ఇండియా టుడే కాన్ క్లేవ్ 2024 న్యూఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికంటే ముందుగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే సమంతకు ఇండస్ట్రీలో క్రష్ ఎవరు అనే విషయాన్ని కూడా ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు. నాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి షారుక్ ఖాన్ గారు అంటే ఎంతో గౌరవం అని తెలియజేశారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ప్రభాస్ తో ఇప్పటివరకు ఈమె నటించకపోయినా ప్రభాస్ అంటే తనకు చాలా గౌరవమని తెలిపారు.
అల్లు అర్జున్..
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ నా క్రష్ అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ నాకు అల్లు అర్జున్ సినీ రోల్ మోడల్ అని చెప్పినటువంటి ఈమె ఇప్పుడు అల్లు అర్జున్ తన క్రష్ అంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…