Samantha: ఆ ఆలోచన అస్సలు లేదు.. అలాంటి పాత్రలు చేసి అలసిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్!
Samantha: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టు లో ఉన్నటువంటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహం తర్వాత ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమంత దంపతులు గత ఏడాది విడాకుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇలా విడాకులు ప్రకటన తర్వాత సమంత పూర్తిగా తన దృష్టిని సినిమాలపై పెట్టింది.
ఈక్రమంలోనే ఈమె తెలుగు తమిళం హిందీ భాషల్లో వివిధ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా వెబ్ సిరీస్ లలో నటించడానికి అనుమతి తెలిపింది.ఇక కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే ఒక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాకు వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచన లేదని రాజ్ అండ్ డీకే తనలో మార్పు తీసుకువచ్చారని అప్పటి నుంచి వెబ్ సిరీస్ లో నటించడం కుదరదని చెప్పకూడదని నిర్ణయించుకున్నా.. అంటూ ఈ ఇంటర్వ్యూలో సమంత చెప్పుకొచ్చారు. ఈ సిరీస్ ద్వారా సరికొత్త సవాళ్లను ఎదుర్కోగలననే నమ్మకం నాలో కలిగిందని ఈమె తెలిపారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా సమంత గ్లామరస్ పాత్రల పై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అందానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి చాలా అలసిపోయాను ఇకపై అలాంటి పాత్రలు చేయనని ఎంతో చాలెంజింగ్ ఉండే పాత్రలలో నటించాలని భావిస్తున్నట్లు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సమంత తెలిపారు. ప్రస్తుతం ఈమె శాకుంతలం డబ్బింగ్ పనులతోపాటు, యశోద అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…