Categories: FeaturedMovie News

Sammeta Gandhi : నాగార్జున గారు స్నేహ ను పిలిచి నా గురించి అలా చెప్పేసరికి… తనతో నటించేటప్పుడు భయపడ్డాను… నాగార్జున అలాంటి వ్యక్తి : సమ్మెట గాంధీ

Sammeta Gandhi : నాటక రంగం నుండి సినిమాల్లోకి వచ్చిన సమ్మెట గాంధీ గారు మంచి పాత్రలున్న సినిమాలను మాత్రమే చేస్తూ నటుడుగా తనకంటూ మంచి గుర్తింపు ను ప్రేక్షకుల నుండి తెచ్చుకున్నారు. ‘రాజన్న’ సినిమాలో నటన సమ్మెట గాంధీ గారిని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. సినిమాల్లో చేస్తూనే నాటకాల్లో చురుగ్గా ఇంక వేషాలు వేస్తూ నాటక రంగానికి సంబంధిచిన ఎన్నో అవార్డులను సంపాదించుకున్న గాంధీ గారు నాగార్జున గారితో రాజన్న సినిమాలో నటించేటపుడు జరిగిన సంఘటన వివరించారు.

స్నేహ తో నా గురించి అలా చెప్పారు.. తనతో నటించాలంటే భయమేసింది…

రాజన్న సినిమా చేస్తున్నపుడు నాగార్జున గారితో ఒక సన్నివేశం, మా ఇద్దరి కాంబినేషన్ లో ఉన్న సన్నివేశం పూర్తయ్యాక నాగార్జున గారు పిలిచి మీరు నాటకాల్లో చేసారా అని అడిగారు, అవును అని చెప్పగా అనుకున్నాను మీ నటన చాలా బాగుంది అని, హీరోయిన్ స్నేహ దగ్గర ఆయన నాటక రంగం నుండి వచ్చారు అందుకే అంత గొప్పగా నటించారు అని చెప్పడం నాకు చాలా గౌరావంగా అనిపించింది అంటూ సమ్మెట గాంధీ గారు చెప్పారు. ఇక సినిమాల్లో ఎంత పెద్ద నటుడితో నటించినా భయం కలుగుదని ఎన్నో నాటాకాలు వేయడం వల్ల స్టేజి భయం లేదని పెద్ద హీరోతో నటించేటపుడు ఆనందంగా ఉంటుందే కానీ భయం ఉండదు అంటూ చెప్పారు.

ఇక రాజన్న సినిమాలో పాప తో నటించేటపుడు కొంచెం భయపడ్డాను.. తను పుట్టుకతో నటి అంటూ ప్రశంసించారు. తాను చాలా బాగా నటించింది, తన ముందు నా నటన పేలవంగా ఉండకూడదని భయపడ్డాను అంటూ చెప్పారు. ఇక రాఘవేంద్ర రావు గారు, విజయేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా గౌరవంగా చూస్తారని చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా ప్రాజెక్టులు అలాగే సీరియల్స్ లో కూడా చేయడం వల్ల నాగార్జున గారు మన సంస్థ సొంత మనిషి మీరు అంటూ చెప్పారు. సుప్రియ గారు అవి ఇవి పాత్రలు చేయకండి, మీరు మంచి ఆర్టిస్ట్ మంచి పాత్రలు మాత్రమే చేయండని సలహా ఇచ్చారంటూ తన అనుభవాలు పంచుకున్నారు గాంధీ గారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago