Sammeta Gandhi : నాటక రంగం నుండి సినిమాల్లోకి వచ్చిన సమ్మెట గాంధీ గారు మంచి పాత్రలున్న సినిమాలను మాత్రమే చేస్తూ నటుడుగా తనకంటూ మంచి గుర్తింపు ను ప్రేక్షకుల నుండి తెచ్చుకున్నారు. ‘రాజన్న’ సినిమాలో నటన సమ్మెట గాంధీ గారిని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. సినిమాల్లో చేస్తూనే నాటకాల్లో చురుగ్గా ఇంక వేషాలు వేస్తూ నాటక రంగానికి సంబంధిచిన ఎన్నో అవార్డులను సంపాదించుకున్న గాంధీ గారు నాగార్జున గారితో రాజన్న సినిమాలో నటించేటపుడు జరిగిన సంఘటన వివరించారు.

స్నేహ తో నా గురించి అలా చెప్పారు.. తనతో నటించాలంటే భయమేసింది…
రాజన్న సినిమా చేస్తున్నపుడు నాగార్జున గారితో ఒక సన్నివేశం, మా ఇద్దరి కాంబినేషన్ లో ఉన్న సన్నివేశం పూర్తయ్యాక నాగార్జున గారు పిలిచి మీరు నాటకాల్లో చేసారా అని అడిగారు, అవును అని చెప్పగా అనుకున్నాను మీ నటన చాలా బాగుంది అని, హీరోయిన్ స్నేహ దగ్గర ఆయన నాటక రంగం నుండి వచ్చారు అందుకే అంత గొప్పగా నటించారు అని చెప్పడం నాకు చాలా గౌరావంగా అనిపించింది అంటూ సమ్మెట గాంధీ గారు చెప్పారు. ఇక సినిమాల్లో ఎంత పెద్ద నటుడితో నటించినా భయం కలుగుదని ఎన్నో నాటాకాలు వేయడం వల్ల స్టేజి భయం లేదని పెద్ద హీరోతో నటించేటపుడు ఆనందంగా ఉంటుందే కానీ భయం ఉండదు అంటూ చెప్పారు.

ఇక రాజన్న సినిమాలో పాప తో నటించేటపుడు కొంచెం భయపడ్డాను.. తను పుట్టుకతో నటి అంటూ ప్రశంసించారు. తాను చాలా బాగా నటించింది, తన ముందు నా నటన పేలవంగా ఉండకూడదని భయపడ్డాను అంటూ చెప్పారు. ఇక రాఘవేంద్ర రావు గారు, విజయేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా గౌరవంగా చూస్తారని చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా ప్రాజెక్టులు అలాగే సీరియల్స్ లో కూడా చేయడం వల్ల నాగార్జున గారు మన సంస్థ సొంత మనిషి మీరు అంటూ చెప్పారు. సుప్రియ గారు అవి ఇవి పాత్రలు చేయకండి, మీరు మంచి ఆర్టిస్ట్ మంచి పాత్రలు మాత్రమే చేయండని సలహా ఇచ్చారంటూ తన అనుభవాలు పంచుకున్నారు గాంధీ గారు.

































